కలిగిరి, ఆగస్టు 09, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం వెలగపాడు గ్రామపంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో వాటర్ ప్లాంట్ పనిచేయకుండా నిలిచిపోవడంతో 280 మంది విద్యార్థునీలు తీవ్ర ఇబ్బంది గురవుతున్న తరుణంలో పాఠశాల ప్రిన్సిపాల్ కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పూసాల వెంగప నాయుడు దృష్టికి తీసుకెళ్లగా విషయం తెలుసుకున్న వెంగప నాయుడు దాతలు కు తెలియజేయగా వెంటనే స్పందించి న గంగిరెడ్డిపాలెం మాజీ సర్పంచ్ సూరేపల్లి మాధవ, పెసలు రవి, బొమ్ము మనోహర్, కలిసి 30,000 వేల రూపాయలు తో మరమ్మతులు చేయించారు. దీంతో కస్తూర్బా గాంధీ పాఠశాలలో 280 మంది విద్యార్థునీలకు త్రాగునీటి కష్టాలు తీరాయి. ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కలిగిరి మండల అధ్యక్షులు పూసాల వెంగప నాయుడు చొరవతో విద్యార్థులకు తాగునీటి సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ఇకపై విద్యార్థినులకు త్రాగునీటి సమస్యలు ఉండవని పాఠశాల సిబ్బందికి తెలిపేరు. విద్యార్థినుల సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన మండల అధ్యక్షులు పూసాల వెంగప నాయుడు కి దాతలు గంగిరెడ్డిపాలెం మాజీ సర్పంచ్ సూరేపల్లి మాధవ, పెసలు రవి, బొమ్ము మనోహర్ లకు విద్యార్థునీలు పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *