మన న్యూస్ సింగరాయకొండ:-

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా, ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణంలోని పాకల రోడ్, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కూటమి నేతల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, శ్రేణులతో కలిసి విజయోత్సవం జరుపుకున్నారు. ప్రభుత్వం ఒక్క సంవత్సరం కాలంలో సాధించిన ప్రగతిని ప్రజలతో పంచుకుంటూ, తమ అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ మరియు టీడీపీ జనసేన శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *