పిఠాపురం జూన్ 9 మన న్యూస్ : రామోజీరావు ప్రధమ వర్ధంతి సందర్భంగా మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో, స్థానిక అయితే నగర్ లో మద్యానికి బానిసై మద్యాన్ని వీడి జీవనం సాగిస్తున్న , కొంగు శ్రీనును మద్యపాన వ్యతిరేక ప్రచారం కమిటీ నాయకులు ఎన్. సూర్యనారాయణ, సహృదయ మిత్ర మండలి అధ్యక్షులు తోట శ్రీనివాస్ చేతుల మీదుగా వారిని సత్కరించి, అభినందించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ, మద్యం రహిత సమాజ స్థాపనకు, నాడు మహిళా ఉద్యమానికి సహకారం అందించిన రామోజీరావు చిరస్మరణీయులు అన్నారు. రామోజీరావు స్ఫూర్తి గా తీసుకుని ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రజలు మద్యం, మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమ ప్రచారంలో భాగస్వాములు కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పెదపాటి రాజేష్,కొంగు బాబి,చంటి ,సూర్యనారాయణ,పిల్లి శ్రీనివాస్, మరియు అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *