మన న్యూస్,తిరుపతి, : శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితా రెడ్డి కి ఏర్పేడు మండల టిడిపి బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బొడుగు ముని రాజా యాదవ్ కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే స్వగృహంలో రిషిత రెడ్డిని ఏర్పేడు మండల బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ముని రాజా యాదవ్ తో పాటు కార్యనిర్వాక కార్యదర్శి కుప్పాల సుబ్రహ్మణ్యం, మడిపాక మాజీ సర్పంచ్ రాయపనేని రవి నాయుడు, నరేంద్ర నాయుడు లు కలసి శాలువతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని శ్రీకాళహస్తీశ్వరుని మొక్కుకున్నట్లు మునిరాజ యాదవ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *