మన న్యూస్ ,నెల్లూరు ,మే 5:– గత రెండు రోజులుగా రైల్వే అధికారులు నెల్లూరు 52 వ డివిజన్ బర్మా షాల్ గుంట రైల్వే ప్రాంతంలో ఉన్న అతి పేద కుటుంబాల ఇళ్లను ఖాళీ చేయమని లేదంటే 6 వ తేదీ రాత్రి జేసీబీ లతో తొలగిస్తామని అనౌన్స్ మెంట్ చేయించి హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ తో, RDO, కమిషనర్ లతో మాట్లాడారు.అధికారులను ఒప్పించి పేద వారికి ప్రత్యాంనాయం చూపే వరకు వారిని బలవంతం గా ఖాళీ చేయించ వద్దని కోరారు. కలెక్టర్ స్పందించి అందుకు అంగీకరించారు. ఈ సందర్బంగా పేదలకు ప్రత్యామ్నాయం చూపేవరకు బాధితుల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ……… బర్మాషాల్ గుంట రైల్వే స్థలాల్లో గత 50 సంవత్సరాలుగా 150 కుటుంబాలు కూలి పనులు చేసుకుంటూ ఈ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నాయని తెలిపారు.
గతంలో టిడిపి ప్రభుత్వంలోనే వీరి ఇళ్ళను తొలగించి ఇక్కడ రైల్వే ట్రాక్ విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారని తెలిపారు. అనంతరం వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరికి ఆరు అంకణాల ఇళ్ళ స్థలాలు కేటాయించి అందులో ఇళ్ళ నిర్మాణాలను 80 శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు. అయితే అర్ధాంతరంగా నిన్నటి రోజున రైల్వే అధికారులు వచ్చి మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి లేదంటే జెసిబి లతో మీ ఇళ్ళ ను 6 వ తేదీ సాయంత్రం కూల్చేస్తామంటూ పేదలను భయభ్రాంతులకు గురి చేయడం అన్యాయమన్నారు. నిరుపేదలను ఉన్నపలంగా ఇల్లను కూల్చేసి చేసి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాధితుల విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మాట్లాడడం కూడా జరిగిందన్నారు. బాధితులకు ప్రత్యామ్నాయ ఇంటి వసతిని చూపకుండా ఖాళీ చేయాలని ఆదేశాలివ్వడం విడ్డూరమన్నారు. సాక్షాత్తు మంత్రి నారాయణ సొంత నియోజకవర్గంలోని పేదలకు అన్యాయం జరుగుతుంటే మంత్రి ఎందుకు స్పందించడం లేదన్నారు. బాధితులకు ఒక నెల సమయం ఇచ్చి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించాలని.. అప్పటి వరకు బాధితులకు టిడ్కో ఇళ్ళ ను కేటాయించాలాని అధికారులను కోరామని అన్నారు. అందుకు అధికారులు ఒప్పుకున్నారని అన్నారు బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన నిలిచి పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
