

మన న్యూస్, నెల్లూరు, మే 5:– నెల్లూరులో వీఆర్సి సెంటర్ లో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. తరవాత నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో వైయస్సార్సీపి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు విఆర్సి సెంటర్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని వైసిపి నాయకులతో కలిసి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రజలకు మజ్జిగ అందజేశారు.ఈ సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…….ప్రజలకు సేవలు అందించాలనే దృక్పథంతో నెల్లూరు నగర నియోజకవర్గంలో మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. మరో రెండు రోజుల్లో మరి కొన్ని చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హంజా హుస్సేని, రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లి నిర్మల, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటూకూరు, నాగార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి, కార్పొరేటర్ వేలూరు ఉమా మహేష్, జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జిగ జయకృష్ణా రెడ్డి, కార్పొరేటర్లు కామాక్షి దేవి, జయలక్షి,నీలి రాఘవరావు, నేతాజీ వేదవతి సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు పెర్నేటి కోటీశ్వర్ రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మున్వర్, ఎస్ దాని విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, 11వ డివిజన్ ఇంచార్జ్ మహేష్ యాదవ్, మాబాషా, పెంచలయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు