

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 5:– నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దేవరపాలెం గ్రామంలో కోటి 80 లక్షల రూపాయల వ్యయంతో ఎలక్ట్రికల్ త్రీ-ఫేస్ కరెంట్, 24 గంటలు నిర్విరామంగా అందించే విద్యుత్ సరఫరా లైను ప్రారంభించిన ఎలక్ట్రికల్ యస్.ఇ. విజయన్, రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ యాదవ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆర్.డి.యస్.యస్. స్కీమ్ లో మిగతా 18 గ్రామలలో 24 కోట్ల రూపాయల వ్యయంతో ఎలక్ట్రికల్ త్రీ-ఫేస్ కరెంట్, 24 గంటలు నిర్విరామంగా ప్రతి ఇంటికి అందించే విద్యుత్ సరఫరా లైను పనులు శరవేగంగా సాగుతున్నాయి అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.నెల్లూరు రూరల్ మండలంలోని 18 గ్రామలలో ఎలక్ట్రికల్ త్రీ-ఫేస్ కరెంట్, 24 గంటలు నిర్విరామంగా ప్రతి ఇంటికి విద్యుత్ అందించడం చాలా సంతోషం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవరపాలెం గ్రామంలో ఇప్పటికే దాదాపు రెండు కోట్ల 30 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. రాబోవు రోజుల్లో శాససభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఇందుకు సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి,యువ నాయకులు , రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ కి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన నా ప్రత్యేక ధన్యవాదాలు అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులురెడ్డి, టిడిపి మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, దేవరపాలెం ఉపసర్పంచ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, టిడిపి నాయకులు కుర్రా పద్మాకర్ రెడ్డి, తాడిపర్తి ఏడుకొండలు నాపా వెంకటేశ్వర్లు, తాడిపర్తి వెంకటేష్, బట్టా సంజీవయ్య, గుంజి అంకులు, తదితరులు పాల్గొన్నారు.
