మన న్యూస్ పాచిపెంట,ఏప్రిల్ 30:- పంచాయతీ రాజ్ కమీషనర్ ఆదేశాలు మేరకు 15 మండలాల్లో అత్యధిక జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో ఎస్ డబ్ల్యూ పి సి షెడ్స్ పరిశీలనచేశామని పార్వతీపురం మన్యం జిల్లా పంచాయతీ అధికారి టి కొండలరావు తెలిపారు. బుధవారం నాడు పాచిపెంట మండలం పాచిపెంట గ్రామపంచాయతీ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో పరిశీలించడం జరిగిoదని పాచిపెంట మండల కార్యదర్శిలు అందరు బాధ్యతగా పనిచేసి ప్రభుత్వ ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలు సూచనలు జారీ చేయడం జరిగినదని తెలిపారు.పి ఆర్ వన్ యాప్ లో ప్రతిరోజు చెత్త సేకరణ వివరములు అప్లోడ్ చేయమని తెలిపామన్నారు.పాచిపెంట మండలం నుండి ఐ వి ఆర్ యస్ కాల్స్కో ఎంపిక కాబడిన 14 గ్రామపంచాయతీలో కార్యదర్శులు గ్రామపంచాయతీలలో ప్రజలకు చెత్త సేకరణ మరియు పొడి చెత్త తడి చెత్త ప్రజల నుంచి సేకరించుటకు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని తెలియజేశారు.స్వర్ణ పంచాయతీలో ఇండ్ల వివరములు ప్యూరిఫికేషన్ చేసామన్నారు.గ్రామపంచాయతీ నుండి చెల్లించవలసిన గ్రంథాలయం ,స్పోర్ట్స్, మరియు ఫైర్ సెస్సులు ను చెల్లించే విధంగా తగ చర్యలు తీసుకొనడం జరిగిందని తెలియజేశారు. క్లాత్ మిత్రాలకు చెల్లించవలసిన జీతములు మరియు కరెంటు చార్జీలు చెల్లించుటకు తగ చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ జిల్లా గ్రామ పంచాయతీ అధికారి పార్వతీపురం మండలం వారు అందర కార్యదర్శులకు సూచించడం జరిగిందన్నారు. ఆయనతోపాటు డిప్యూటీ ఎంపీడీవో మల్లేశ్వర రావు హాజరయ్యారు.
