

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం తాసిల్దార్ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రతినెల చివరి రోజున ఎస్సీ ఎస్టీ కాలనీలలో పౌర హక్కులపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పౌర హక్కుల దినోత్సవం పాత సింగరాయకొండ పంచాయతీ పరిధి, మల్లికార్జున్ నగర్ గిరిజన కాలనీలో నిర్వహించారు. కార్యక్రమానికి మండల తాసిల్దార్ రవి అధ్యక్షత వహించి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరాదీశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల గురించి, గిరిజనులను ఎవరన్నా తక్కువగా చూసే సంఘటనలు, వారిపై దాడి చేయటం లాంటి అంశాలను వాకబు చేశారు.అదేవిధంగా ప్రభుత్వం అందించు వివిధ పథకాలను వివరించారు. కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పొట్లూరి లక్ష్మయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరాయకొండ పరిధిలో గిరిజనులు ఎక్కువగా కర్రకోత పనులకి వెళ్తున్నట్టు తెలియజేస్తూ,యజమాని వద్ద నుండి గిరిజనులకు అందుతున్న న్యాయబద్ధమైన కూలి మరియు పనిచేసే సమయం గురించి తెలియజేశారు.సింగరాయకొండ మండల పరిధిలో ఒప్పంద కూలీలుగా పనిచేస్తున్న గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే ప్రకాశం జిల్లా కలెక్టర్ వారి ద్వారా తగు న్యాయం చేయించగలరని ఈ సందర్భంగా తెలియజేశారు.కార్యక్రమంలో న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు,ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి సురేష్, స్థానిక నాయకులు ఝాన్సీ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.