

Mana News, Chittoor :- అమరావతి రైతుల త్యాగాలని అవమానపరచి ,అమరావతిని తాకినందుకే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఆధపాతాళానికి పడిపోయిందని చిత్తూరు జిల్లా టిడిపి నాయకులు అన్నారు. అమరావతి రైతుల యొక్క బలిదానం వలన ఈరోజు అమరావతి నిర్మాణ కార్యక్రమాలు పునః ప్రారంభమవుతుందని, అందుకు చంద్రబాబునాయుడు గారికి, దేశ ప్రధాని మోడీ గారికి, చిత్తూరు జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు, తెలియజేశారు. భారత దేశ రాజకీయ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా 1631 రోజులు నిర్విరామమైనటువంటి పోరాటం చేసినటువంటి అమరావతి రైతులు, అదేవిధంగా 230 మంది పైగా రైతులు ప్రాణ త్యాగం చేసి అమరావతిని నిలబెట్టారని అన్నారు. 3000 పోలీసు కేసుల్ని అవలీలగా ఎదుర్కొని, మహిళలు సైతం ఉద్యమాలలో పాల్గొని అమరావతి నిలబెట్టారని, అది అమరావతి యొక్క శక్తి అని, సందర్భంగా చిత్తూరు జిల్లా టిడిపి నాయకులు అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు అమరావతి పైన తమ వైఖరిని మార్చుకొని మూడు రాజధానుల నినాదాన్ని పక్కన పెట్టి అమరావతికి మద్దతు పలకాలని ,లేకుంటే వైసిపి జగన్మోహన్ రెడ్డి కాలగర్భంలో కలిసిపోతారని అన్నారు. రైతుల త్యాగాలని హేళన చేశారని ,అందుకే ఈరోజు అవహేళన పడ్డారని అన్నారు .49 వేల కోట్ల రూపాయలతో అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలు జరుగుతుండటం ప్రపంచ దేశాలు నివ్వరిపోయే విధంగా నిర్మాణ కార్యక్రమాలు జరుగుతుందని అన్నారు. అమరావతిని కుల రాజధానిగా ముద్ర వేసి జగన్మోహన్ రెడ్డి పాతాళానికి పడ్డారని అన్నారు. అమరావతి దళిత రాజధాని అన్న విషయాన్ని మరిచిపోయి, దళిత రాజధాని పైన విషయం కక్కి ఈరోజు తాను రాజకీయంగా గల్లంతయిన విషయం ప్రజలందరికీ తెలిసింది అని అన్నారు. ఇప్పటికైనా విషం కక్కే రాజకీయాలు పక్కన పెట్టాలని ఈ సందర్భంగా టిడిపి నాయకులు అన్నారు. మే రెండో తేదీన ప్రధాని చేతులతో శంకుస్థాపన కార్యక్రమాలు, పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభమవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కోరుకున్నారు . ఈ యొక్క ప్రెస్ మీట్ లో టిడిపి కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, జిల్లా క్రిష్టియన్ అధ్యక్షుడు మేషాక్ పూతలపట్టు నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు ధరణి ప్రకాష పాల్గొన్నారు .
