వినూత్న ప్రేమకథతో రాబోతున్న ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ మొదటి చిత్రం !!!

వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో ఒక చిత్రం రాబోతోంది. యువతను విపరీతంగా ఆకట్టుకునే ప్రయత్నమే ఈ చిత్రం. ఇప్పటివరకు సందేశం, సామాజిక స్పృహతో సినిమాలు చేసిన దర్శకుడు భాను మొట్టమొదటి సారిగా తన పంథాను మార్చుకొని ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను డైరెక్ట్ చేశారు. నలభై తొమ్మిది రోజులు నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. జూన్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యువతను విపరీతంగా ఆకట్టుకునే ఐదు అద్భుతమైన సాంగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి.ఒక పెద్ద సంగీత కుటుంభం నుండి మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు, అలాగే ఒక కొత్త టాలెంటెడ్ రైటర్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.డెబ్భై ఐదు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ గా చేసిన ఒక అబ్బాయి, పదహారణాల తెలుగు అమ్మాయి ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి నిర్వాహణ మర్రి రవికుమార్.ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ సంస్థ లో నిర్మాత కనకదుర్గారావు పప్పుల ఎక్కడా రాజీ పడకుండా సినిమాను గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. త్వరలో ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను యూనిట్ సభ్యులు విడుదల చేయబోతున్నారు.

Related Posts

షూటింగ్ పూర్తి చేసుకున్న “దీక్ష”

మన న్యూస్ : ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, పి. అశోకుమార్ నిర్మాతలుగా, ఆర్ కె గౌడ్ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్స ఖాన్, తులసి, అనూష,కీర్తన,…

హలో బేబీ మూవీ రివ్యూ & రేటింగ్ !!!

Mana News :- ఇటీవల సోలో క్యారెక్టర్ తో సినిమాలు బాగానే వస్తున్నాయి. సోలో క్యారెక్టర్ తో హలో బేబీ సినిమా ఏప్రిల్ 25న (శుక్రవారం) థియేటర్స్ లో విడుదల అయ్యింది, కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అమరావతి బహిరంగ సభకు వెదరుకుప్పం నాయకుల ప్రస్థానం- రేపే అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభం

అమరావతి బహిరంగ సభకు వెదరుకుప్పం నాయకుల ప్రస్థానం- రేపే అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభం

175 నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎమ్ఈ పార్కులు- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

175 నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎమ్ఈ పార్కులు- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఈస్ట్ డిఎస్పీ ని సన్మానించిన సింగంశెట్టి సుబ్బరామయ్య

ఈస్ట్ డిఎస్పీ ని సన్మానించిన సింగంశెట్టి సుబ్బరామయ్య

సిపిఎస్ ఉద్యోగులారా ఏకం కండి.. నినాదంతో చైతన్య యాత్ర..

సిపిఎస్ ఉద్యోగులారా ఏకం కండి.. నినాదంతో చైతన్య యాత్ర..

పోతిరెడ్డి పాళెం రోడ్డు ప్రమాదంలో మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

పోతిరెడ్డి పాళెం రోడ్డు ప్రమాదంలో మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

పోతిరెడ్డిపాలెం దుర్ఘటన అత్యంత విషాదకరం – నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

పోతిరెడ్డిపాలెం దుర్ఘటన అత్యంత విషాదకరం – నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి