ఎ స్టార్ ఈజ్ బార్న్ సినిమా నుండి “నా గతమే” సాంగ్ ను విడుదల చేసిన డైరెక్టర్ చందు మొండేటి !!!

Mana News :- టాలీవుడ్ సినిమా పరిశ్రమ కొత్తవారికి ఎప్పుడు స్వాగతం పలుకుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త సినిమా “ఏ స్టార్ ఈజ్ బార్న్”. వీజే సాగర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం అందిస్తున్నారు. సి.రవి సాగర్ & వి జె సాగర్ నిర్మాణ సారథ్యంలో సి ఆర్ ప్రొడక్షన్స్, వి జె ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ప్రియా పాల్, నేహా శర్మ, ఊహ రెడ్డి ముగ్గురు నూతన కథానాయికలు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. క్యారక్టర్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తో పక్కా కల్ట్ కమర్షియల్‌ ఎంటర్టైన్మెంట్ సినిమాగా రాబోతున్న ఈ సినిమా నుండి “నా గతమే” సాంగ్ ను డైరెక్టర్ చందు మొండేటి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ… “నా గతమే సాంగ్ బావుంది, పోస్టర్స్, ప్రోమోస్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ సభ్యులందరికి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు. తెలంగాణలోని వనపర్తి, కొల్లాపూర్, సోమశిల, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాలో 93 మంది కొత్త నటీనటులు నటిస్తుండడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండటం విశేషం. త్వరలో ఈ చిత్ర టీజర్, ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే అనేక ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి.

Related Posts

మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అనంతపురంలో బీజేపీకి బలమేర్పడుతోంది: భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర బీజేపీలో చేరారు

అనంతపురంలో బీజేపీకి బలమేర్పడుతోంది: భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర బీజేపీలో చేరారు

యువకవి అంజనాద్రికి మాజీ మంత్రి రోజా అభినందనలు

యువకవి అంజనాద్రికి మాజీ మంత్రి రోజా అభినందనలు

శ్రీశైలం నీటి విడుదల, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆందోళనరాయలసీమ ప్రతినిధులను ‘కళ్ళులేని కబోదులు’గా న్యాయవాది కృష్ణమూర్తి ఆరోపణ

శ్రీశైలం నీటి విడుదల, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆందోళనరాయలసీమ ప్రతినిధులను ‘కళ్ళులేని కబోదులు’గా న్యాయవాది కృష్ణమూర్తి ఆరోపణ

ఘనంగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులు జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులు జన్మదిన వేడుకలు

పీర్లకు వెండి గుర్రం, శంకు-చక్రాలను అందించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

పీర్లకు వెండి గుర్రం, శంకు-చక్రాలను అందించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

మళ్లీ మళ్లీ ప్రధానమంత్రి నరేంద్రుడే! -మళ్లీ మళ్లీ నరేంద్రుడే ప్రధానమంత్రి కావాలని కనకదుర్గ దేవస్థానంలో పూజలు.

మళ్లీ మళ్లీ ప్రధానమంత్రి నరేంద్రుడే! -మళ్లీ మళ్లీ నరేంద్రుడే ప్రధానమంత్రి కావాలని కనకదుర్గ దేవస్థానంలో పూజలు.