షూటింగ్ పూర్తి చేసుకున్న “దీక్ష”

మన న్యూస్ : ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, పి. అశోకుమార్ నిర్మాతలుగా, ఆర్ కె గౌడ్ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్స ఖాన్, తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం”దీక్ష”. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ నేటితో హైదరాబాద్ లో పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే పాయింట్ ను ఇతివృత్తంగా తీసుకుని లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. చాలా అందమైన లొకేషన్స్ లో, చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పాటలు అద్భుతంగా వచ్చాయి. మా బ్యానర్ కు మంచి పేరు తెచ్చే చిత్రం అవుతుంది. లవ్ యాక్షన్ తో పాటు మైథలాజికల్ ను జోడించి నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో కిరణ్ భీముడు పాత్రలో అద్భుతమైన నటన కనపరచాడు. మా చిత్రం ద్వారా హీరో కిరణ్ కి మంచి పేరు, గుర్తింపు వస్తాయి. ఆక్స ఖాన్ స్పెషల్ సాంగ్ లో, తనదైన శైలిలో డాన్స్ ఆదరగొట్టింది. మా చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో దీక్షతో పనిచేసారు. సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ అద్భుతమైన 5 పాటలు అందించారు. మధుప్రియ తదితర ముఖ్య గాయనీ గాయకులు తమ స్వరాన్ని అందించారు. ఆర్ ఆర్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. ఈ చిత్రం లో 5ఫైట్స్ ఉన్నాయి. రోహిత్ శర్మను విలన్ క్యారెక్టర్ తో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దీక్ష చిత్రం మా బ్యానర్ కు సూపర్ హిట్ అందించే చిత్రం అవుతుంది. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో మే నెలలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాము అన్నారు.నటి ఆక్సఖాన్ మాట్లాడుతూ.. దీక్ష సినిమా నా కెరీర్ ను మలువు తిప్పే చిత్రం అవుతుంది. అంత బాగా వచ్చింది మూవీ. నా తోటి నటీనటులందరూ బాగా నటించారు. ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ లో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. మా చిత్రాన్ని ప్రేక్షకులందరు చూసి విజయవంతం చెయ్యాలని కోరుతున్నాను అన్నారు.నటి తులసి మాట్లాడుతూ దీక్ష సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. అవకాశం ఇచ్చిన దర్శకులు ఆర్కే గౌడ్ గారికి కృతజ్ఞతలు అన్నారు.నటుడు రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఆర్ కె గౌడ్ గారు దీక్ష మూవీ లో విలన్ రోల్ ఇచ్చారు. చాలా అద్భుతంగా వచ్చింది మూవీ. ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను అన్నారు.

Related Posts

వినూత్న ప్రేమకథతో రాబోతున్న ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ మొదటి చిత్రం !!!

వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో ఒక చిత్రం రాబోతోంది. యువతను విపరీతంగా ఆకట్టుకునే ప్రయత్నమే ఈ చిత్రం. ఇప్పటివరకు సందేశం, సామాజిక స్పృహతో సినిమాలు చేసిన దర్శకుడు భాను మొట్టమొదటి సారిగా…

హలో బేబీ మూవీ రివ్యూ & రేటింగ్ !!!

Mana News :- ఇటీవల సోలో క్యారెక్టర్ తో సినిమాలు బాగానే వస్తున్నాయి. సోలో క్యారెక్టర్ తో హలో బేబీ సినిమా ఏప్రిల్ 25న (శుక్రవారం) థియేటర్స్ లో విడుదల అయ్యింది, కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అమరావతి బహిరంగ సభకు వెదరుకుప్పం నాయకుల ప్రస్థానం- రేపే అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభం

అమరావతి బహిరంగ సభకు వెదరుకుప్పం నాయకుల ప్రస్థానం- రేపే అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభం

175 నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎమ్ఈ పార్కులు- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

175 నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎమ్ఈ పార్కులు- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఈస్ట్ డిఎస్పీ ని సన్మానించిన సింగంశెట్టి సుబ్బరామయ్య

ఈస్ట్ డిఎస్పీ ని సన్మానించిన సింగంశెట్టి సుబ్బరామయ్య

సిపిఎస్ ఉద్యోగులారా ఏకం కండి.. నినాదంతో చైతన్య యాత్ర..

సిపిఎస్ ఉద్యోగులారా ఏకం కండి.. నినాదంతో చైతన్య యాత్ర..

పోతిరెడ్డి పాళెం రోడ్డు ప్రమాదంలో మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

పోతిరెడ్డి పాళెం రోడ్డు ప్రమాదంలో మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

పోతిరెడ్డిపాలెం దుర్ఘటన అత్యంత విషాదకరం – నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

పోతిరెడ్డిపాలెం దుర్ఘటన అత్యంత విషాదకరం – నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి