సంజోష్ తగరం, హర్షిత హీరో–హీరోయిన్లుగా ‘జోష్’ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతున్న నూతన చిత్రం ‘మై లవ్’ తాజాగా ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఐటీ & ఇండస్ట్రీస్ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు క్లాప్ కొట్టగా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కెమెరా స్విచ్ ఆన్ చేసి తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చిత్ర బృందం తమ అభిప్రాయాలను పంచుకుంది.హీరో, దర్శకుడు సంజోష్ తగరం మాట్లాడుతూ, ‘మై లవ్’ ఒక యూనివర్సల్ కంటెంట్‌తో రూపొందుతోందని, ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని కొత్త పాయింట్‌ను ఈ చిత్రంలో ప్రతిపాదించామని తెలిపారు. నేటి యువతకు బలమైన సందేశంతో పాటు మంచి వినోదాన్ని అందించే కథాంశం ఇందులో ఉందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటుందని చెప్పారు. తన కుటుంబం నుంచి లభించిన సహకారం మరువలేనిదని, మంచి సాహిత్య విలువలతో కూడిన పాటలు త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తాయని వెల్లడించారు. దర్శకుడిగా, నటుడిగా ఈ చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.నిర్మాత ఆర్.వి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, మంచి కథ, సూటిగా సాగే కథనంతో ‘మై లవ్’ను రూపొందిస్తున్నామని, తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.హీరోయిన్ హర్షిత మాట్లాడుతూ, సంజోష్ చెప్పిన కథా పాయింట్ తనకు చాలా కొత్తగా అనిపించిందని, ఈ చిత్రం ద్వారా తనకు మంచి నటిగా గుర్తింపు వస్తుందన్న విశ్వాసాన్ని తెలియజేశారు.కొరియోగ్రాఫర్ రవి కృష్ణ మాట్లాడుతూ, చాలా రోజుల తర్వాత అర్థవంతమైన సాహిత్యంతో, విలువలతో కూడిన పాటలకు కొరియోగ్రఫీ చేయడానికి అవకాశం రావడం ఆనందంగా ఉందని అన్నారు. తన కెరీర్‌లో ఇది బెస్ట్ చిత్రంగా నిలుస్తుందన్న నమ్మకంతో పాటు, సింగిల్ కార్డు కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చిన సంజోష్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఈ చిత్రంలో 30 ఇయర్స్ పృథ్వి, గబ్బర్ సింగ్ ఆంజనేయులు, రచ్చ రవి, డీజే టిల్లు మురళీధర్ గౌడ్, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీకి వెంకట్ రాజు, డైలాగ్స్‌కు సాహిల్, ఆర్ట్ డైరెక్షన్‌కు వెంకటేష్ గుల్ల పని చేస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను సంజోష్ తగరం నిర్వర్తిస్తున్నారు. అర్థవంతమైన ప్రేమకథగా రూపుదిద్దుకుంటున్న ‘మై లవ్’ చిత్రం పై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.








