నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక “బెస్ట్ 3 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ 2025 ” అవార్డును అందుకున్న రాజన్న ఫౌండేషన్:

Mana News, తిరుపతి, 28.04.2025]: అమర రాజా కంపెనీ సౌజన్యంతో నడిచే రాజన్న ఫౌండేషన్ నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మకమైన “బెస్ట్ 3 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ 2025 ” నీ అందుకున్నది. ఈ అవార్డ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి, ప్రత్యేకంగా స్కిల్ డెవలప్‌మెంట్ రంగంలో రాజన్న ఫౌండేషన్ అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈరోజు దేశ రాజధాని న్యూఢిల్లీ లోని హయత్ సెంట్రిక్ హోటల్ నందు ప్రముఖ సి ఎస్ ఆర్ మార్కెటింగ్ మరియు బ్రాండ్ హానాక్ సంస్థ వారిచే గ్లోబల్ సి ఎస్ ఆర్ అవార్డ్స్ 2025 ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డుని రాజన్న ఫౌండేషన్ హెడ్ సతీష్ రాళ్లపల్లి ఆల్ ఇండియా పబ్లిక్ సెక్టార్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్,ఎక్స్ జనరల్ రమేష్ సచిదేవ్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. నిరుద్యోగ్యవతి యువకులకు మల్టీ స్కిల్ డెవలప్మెంట్ మరియు వ్యక్తిగత వికాసం విభాగం తో కూడిన నైపుణ్యాభివృద్ధి సేవలు అందించడం ద్వారా వారికి మెరుగైన జీవనోపాధి అవకాశాలను పొందడంలో రాజన్న ఫౌండేషన్ యొక్క చొరవలకి గానూ ఈ అవార్డును అందించి గౌరవించినది. రాజన్న ఫౌండేషన్ ద్వారా 2014 లో స్థాపించిన అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఇప్పటివరకు దాదాపు 3000 నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ విభాగాలలో నైపుణ్యాభివృద్ధి చేయడమే కాకుండా వారికి అమర రాజా సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించారు, తద్వారా ఆ నిరుద్యోగ యువత జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపడంతో పాటు, వారు స్వయం సమృద్ధిగా అభివృద్ధి చెందడానికి మరియు సమాజంలో గౌరవమైన జీవితాన్ని గడపడానికి దోహద పడింది.

ఈ అవార్డు అందుకోవడం పట్ల రాజన్న ఫౌండేషన్ ఫౌండర్ గల్లా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ “నైపుణ్యాభివృద్ధి విభాగంలో మా సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందుకోవడం మాకు సంతోషంగా ఉంది, మా కార్యక్రమాలు ద్వారా నైపుణ్యం అంతరాన్ని తగ్గించడం మరియు అందరికీ మరింత సమగ్రమైన మరియు స్థిరమైన భవిష్యత్తును సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాము. మరియు ఈ అవార్డు రావడానికి కృషి చేసిన అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సిబ్బందిని మరియు విద్యార్థి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తున్నాను” అని అన్నారు. ఈ అవార్డు అందుకోవడం పట్ల అమర రాజా సంస్థల చైర్మన్ శ్రీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ “ఈ అవార్డు అందుకోవడం ద్వారా మా అమర రాజా స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ద్వారా సానుకూల సామాజిక ప్రభావాన్ని సృష్టించేందుకు రాజన్న ఫౌండేషన్ యొక్క నిబద్ధతకు నిదర్శనం మరియు అదేవిధంగా రాబోవు కాలంలో రాజన్న ఫౌండేషన్ ద్వారా అనేక రంగాలలో విశిష్టమైన సేవలు అందిస్తామని” అని అన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..