నెల్లూరులో జనసేన నాయకులు మానవహారం

మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 25:– కాశ్మీర్ హమరా హై….. పాకిస్తాన్ షర్మనా హై…… ఉగ్రవాద దాడిలో ఏరులై పారిన ప్రతి భారతీయుడు రక్తపు బొట్టుకు లెక్క చెబుతాం.జాతి సమైక్యతను సమైక్యతకు భంగం కలిగించే పిచ్చి కుక్కలను తరిమికొడదాం. భారత్ మాతా కి జై…. గునుకుల కిషోర్ జనసేన నాయకులు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు కూటమి నాయకులు ప్రత్యక్షంగా రాష్ట్రంలో ఉగ్రవాద దాడిలో మరణించిన కుటుంబాలకి వారు లేని లోటు తీర్చలేకపోయినా భవిష్యత్తు రక్షణ తమ తోడుగా ఉన్నామని బాధ్యత తెలియజేశారు అని జనసేన నాయకులు గునుకుల కిషోర్ అన్నారు.కూటమి మంత్రులు ఉగ్రవాద చర్యకు బాధ్యత వహిస్తూ భవిష్యత్తు రక్షణ భుజాలపై మోస్తామని మధుసూదన్ పాడి మేసి తెలిపారు.పాహల్గాం ఉగ్రవాద దాడిలో మరణించిన భారతీయులకు సంతాప దినాలుగా ఈ మూడు రోజు ప్రకటించాలని అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మేరకు ఈ శుక్రవారం నెల్లూరు రూరల్ మద్రాసు బస్టాండ్ వద్ద జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ సూచనల తో జనసేన నాయకులు మానవహారం తో సంతాపం తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ……… తీవ్ర అస్వస్థతతో కదలలేని పరిస్థితి ఉన్నప్పటికీ దేశభక్తిని పార్టీ బాధ్యతను ముందుకు నడిపించాల్సిందిగా అనుక్షణం ఫోన్ చేస్తూ జిల్లాలో మూడు రోజుల సంతాప సభలను ముందుకు నడిపించిన జిల్లా బాధ్యులు చైర్మన్ వేములపాటి అజయ్ స్ఫూర్తిని ముందుకి తీసుకెళ్తాంఅని అన్నారు. మతం కనుక్కొని మరీ మారణ హోమం సృష్టించిన పాకిస్తాన్ తీవ్రవాదులకు కూటమి ప్రభుత్వం సరైన సమాధానం చెబుతుంది అని అన్నారు.పవన్ కళ్యాణ్ తెలిపినట్లుగా మూడు దశాబ్దాల కిందట అంతమైందని అనుకున్నా పాకిస్తాన్ ఉగ్రవాదం దేశ మంచితనాన్ని చేతకానితనంగా అనుకుంటూ ఇంకా ఉంది అని తెలిపారు. దీనికి ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుంది. జీవితకాలం దీన్ని గుర్తుంచుకుంటామని తెలిపారు.ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో సింధు జలాల ఒప్పందం విషయంలో పాకిస్తాన్ దౌత్య కార్యాలయాలపై చర్యల మొదలయ్యాయి అని తెలిపారు.మరే ఇతర భారతీయ కుటుంబాలకి ఈ విధంగా జరగకుండా చర్యలు ఉండబోతున్నాయి అని అన్నారు.
ఉగ్రవాదుల ఉన్నాద బాధను చాలా దగ్గరగా జిల్లాలో కావలి నియోజకవర్గం లో జనసేన క్రియాశీలక సభ్యత్వ కుటుంబ సభ్యుల ద్వారా ప్రత్యక్షంగా చూసాము. మరే ఇతర భారతీయుడికి ఇటువంటి పరిస్థితి కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.ఉగ్రవాద దాడిలో ఆశువు బాసిన ప్రతి భారతీయుల ఆత్మ శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఈ విపత్తును ఎదుర్కొనే ధైర్యాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాల్సిందిగా కోరుతున్నాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్,కిషోర్ గునుకుల కిషోర్,జమీర్,కృష్ణారెడ్డి, పావుజెన్ని చంద్రశేఖర్, సుధా మాధవ్,శ్రీపతి రాము,గుర్రం కిషోర్, ప్రసాద్ యాదవ్, ఈగి సురేష్,రాజేష్,పేనేటి శ్రీకాంత్,యాసీన్,పవన్,ఆబిద్,వెంకీ,పోలయ్య,మహేష్ శర్మ,నజీర్ బాషా,వెంకటేశ్వర్లు,హరి రెడ్డి,తదితర జనసైనికులు,వీర మహిళలలు తదితరులు పాల్గొన్నారు .

Related Posts

గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధి……. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్

Mana News :- గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి గొట్టిపాటి…

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా గొల్లప్రోలు విలేఖరి డి.నారాయణ మూర్తి అందిస్తున్న ప్రత్యేక కథనం

Mana News :- ప్రపంచంలోని చాలా దేశాల్లో మే 1న బ్యాంకులకు సెలవు ఎందుకో తెలుసా? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 160 కి పైగా దేశాలు అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ రోజున ఏకమవుతున్నాయి. దీనిని సాధారణంగా మే డే అని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధి……. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్

గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధి……. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్

కెసిఆర్ ఇక నీ జీవితం ఫామ్ హౌస్కే అంకితం – విమర్శలు గుప్పించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు గోడిశాల రామనాధం

కెసిఆర్ ఇక నీ జీవితం ఫామ్ హౌస్కే అంకితం – విమర్శలు గుప్పించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు గోడిశాల రామనాధం

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా గొల్లప్రోలు విలేఖరి డి.నారాయణ మూర్తి అందిస్తున్న ప్రత్యేక కథనం

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా గొల్లప్రోలు విలేఖరి డి.నారాయణ మూర్తి అందిస్తున్న ప్రత్యేక కథనం

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత గోరంట్ల శ్రీను మృతి -ఆటో బులోరో డీ…నాలుగు రోజుల క్రితం కుమారుడి వివాహం- పచ్చ తోరణం ఆరకముందే ప్రమాద రూపంలో పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత గోరంట్ల శ్రీను మృతి -ఆటో బులోరో డీ…నాలుగు రోజుల క్రితం కుమారుడి వివాహం- పచ్చ తోరణం ఆరకముందే ప్రమాద రూపంలో పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం

ఐజ గురుకుల పాఠశాల కోసం మరోసారి కదలిన ఐజ అఖిలపక్షం

ఐజ గురుకుల పాఠశాల కోసం మరోసారి కదలిన ఐజ అఖిలపక్షం

అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – మామిడి తోటను, వరి ధాన్యము ,కల్లాలను పరిశీలించిన ఎమ్మెల్యే

అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – మామిడి తోటను, వరి ధాన్యము ,కల్లాలను పరిశీలించిన ఎమ్మెల్యే