

మన న్యూస్,తిరపతి / నెల్లూరు, ఏప్రిల్ 25:– తిరుపతి,అన్నమయ్య జిల్లాల పర్యటనలో భాగంగా తలకోనలో శుక్రవారం ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్లతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమావేశం అయ్యారు.ఈ సమావేశానికి అపస్మా ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్లు అందరూ హాజరై ప్రైవేట్ స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై చంద్రశేఖర్ రెడ్డి తో చర్చించారు.
సమస్యలు అధిగమించే దిశగా పరస్పర సహకారంతో ముందుకు పోవాలని నిర్ణయించారు.ప్రైవేట్ స్కూల్ సమస్యలు పరిష్కారంలో తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వారికి తెలియజేశారు.అనంతరం మదనపల్లెలోని విద్యాసంస్థల అధినేత రఘునాథరెడ్డి,
అన్నమయ్య జిల్లా కలికిరిలోని విద్యాసంస్థల అధినేత ఆదినారాయణ రెడ్డి, తిరుపతి బాకరాపేట జనార్దన్ రెడ్డి
లకు గౌరవ డాక్టరేట్ రావడంతో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వారిని ప్రత్యేకంగా అభినందించారు.
