

మన న్యూస్,నెల్లూరు రూరల్,ఏప్రిల్ 25: నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో కొండాయపాలెం గేట్ మరియు బి. వి. నగర్ రైల్వే బ్రిడ్జిలపై నగర కమిషనర్ నందన్, ఆర్డిఓ, విద్యుత్ శాఖ, పబ్లిక్ హెల్త్ శాఖ, కార్పొరేషన్,రైల్వే శాఖ అధికారులతో శుక్రవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
కొండాయపాలెం గేట్, బి.వి.నగర్ రైల్వే గేట్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిలు లేనందున ప్రజలు అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.ఎట్టకేలకు కొండాయపాలెం గేట్, బి.వి.నగర్ రైల్వే గేట్ ల వద్ద కేంద్ర రైల్వే శాఖ రైల్వే అండర్ బ్రిడ్జిలను మంజూరు చేసింద అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.అధికారులందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత నేనే తీసుకుంటా అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.మే 10వ తేదీ లోపల వివిధ శాఖ అధికారుల సహకారాన్ని రైల్వే శాఖ అధికారులకు అందిస్తాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రోత్సాహంతో జూన్ నెలాఖరు లోపు టెండర్లు పిలుస్తారు.కొండాయపాలెం గేట్,బి.వి.నగర్ రైల్వే గేట్ల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిలు నెల్లూరు నగరానికి ఎంతో మేలు చేస్తాయి అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
