

శంఖవరం, మన న్యూస్ (అపురూప్): భూమిలో పి ఎం డి ఎస్ విత్తనాలు వేయడం వలన నేల సారవంతం అవుతుందని డి ఎం ఎం టి మద్దూరి సత్తిబాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (డిపిఎం) ఎలియాజర్ ఆదేశాల మేరకు మండల కేంద్రం శంఖవరం గ్రామం లో ఆదివారం డియమ్ యమ్ టి సత్తిబాబు ఆధ్వర్యంలో ఐ సి ఆర్ పి లు నాగ వెంకటలక్ష్మి, కామేశ్వరి 5 గురు రైతులతో 10 ఎకరాలలో పి యం డి ఎస్ (30 రకాల తో కూడిన) విత్తనాలు చల్లించడం జరిగింది. ముత్తుం గోవిందు, ముత్తుం అప్పారావు, అడపా వెంకటేశ్వరరావు, కర్రి సత్తిబాబు, రేలంగి వెంకన్న అనే రైతులతో విత్తనాలు చల్లించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎంఎంటి సత్తిబాబు మాట్లాడుతూ రుతుపవనాలు రాకముందు, వరి కోతలకు ముందు రైతులు పొలాలను సారవంతం చేసుకునే విధంగా పిఎండిఎస్ విత్తనాలు చల్లుకోవాలని, దీని వలన నేలలోని కర్బన శాతం పెరుగుతుందని, నేలలో జీవవైవిద్యం పెరుగుతుందని, బహుళ పంటల వలన నేలలో కలుపు ఉండదని, ప్రధాన పంట వాతావరణ వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యం ఉంటుందని అన్నారు. నేలలో నీటిని నిలువ చేసుకునే సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.