సర్వేయర్‌ ప్రవర్తనపై రైతు ఆవేదన…

  • కొంతంగి కొత్తూరులో రీ-సర్వే కొరకు 8 నెలలుగా తిరుగుతూ విసుగొచ్చిన కర్రీ అగ్గిబాబు…

శంకవరం, మన న్యూస్ (అపురూప్)
కొంతంగి కొత్తూరు గ్రామానికి చెందిన కర్రీ అగ్గిబాబు అనే రైతు తన భూమికి సంబంధించిన సర్వేలో పలు పొరపాట్లు చోటుచేసుకున్నాయని, వాటిని సరిచేయాలని గత ఎనిమిది నెలలుగా రీ-సర్వే కోసం అధికారులను ఆశ్రయిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ రీ-సర్వే ప్రక్రియలో సంబంధించిన సర్వేయర్ స్పందించకపోవడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు తెలిపిన వివరాల ప్రకారం, కొంతంగి కొత్తూరు గ్రామంలో 88/2 సర్వే నెంబరు గల భూమిలో 72 సెంట్లు భూమి ఉండగా తమ కుటుంబ అవసరల కోసం 50 సెంట్లు అమ్మకం జరిగిందని దీనిపై సబ్ రిజిస్టర్ కార్యాలయం వారిని సంప్రదించగా వీటిని రెండు భాగాలుగా విభజించుకుని రమ్మని చెప్పడంతో అనేక మార్లు తిరిగినా సరే స్పందించకపోవడంతో ప్రైవేట్ సర్వేర్ ని ఆశ్రయించి తను ఇచ్చిన రిపోర్టు ప్రకారం సర్వే చేయమని కోరడమె కాకుండా తప్పుగా కొలవబడ్డ భూమికి సరిచూడాలని పలుమార్లు చలానాలు కట్టి, సంబంధిత సర్వేయర్ చుట్టూ తిరిగినా ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా, రీ-సర్వే చేయాలంటే మొత్తం భూమికి చెల్లించాలంటూ అనుచితంగా డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో, శంకవరం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించిన అగ్గిబాబు, తాసిల్దార్ తాతారావుని వివరణ కోరగా స్పందించిన తహసీల్దార్ మండల సర్వేయర్‌ను సంప్రదించిమని తెలపడంతో ఇది తప్పుగా చేయబడింది అని తెలిపారు. రైతు తనకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాడు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///