ఎంతకు తెగించార్రా.. నమ్మితే ఇంత మోసం చేస్తారా!?

Mana News :- Virat Kohli VS Shreyas Iyer: ఆర్సీబీని దాని సొంతగడ్డపైనే ఓడించాక పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ కాస్త గట్టిగానే సంబరాలు చేసుకున్నాడు. మరి అది చూసిన విరాట్ కోహ్లీ ఊరుకుంటాడా? దానికి గట్టిగానే ప్రతీకారం తీర్చుకున్నాడు. ఏప్రిల్ 20న పంజాబ్‌ కింగ్స్ ను దాని సొంతగడ్డపైనే ఆర్సీబీ ఓడించడంలో కీలకంగా వ్యవహరించి రెచ్చిపోయాడు. విజయానంతరం శ్రేయస్‌ వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ సంబరాలు కూడా చేసుకున్నాడు. దీంతో శ్రేయస్‌ కాస్త నొచ్చుకున్నట్లే కనిపించాడు. ఇదంతా కాంట్రవర్సీకి దారీ తీసింది. ముఖ్యంగా ఈ వ్యవహారంతో శ్రేయస్ అయ్యర్ పై హేట్ బాగా క్రియేట్ అయింది. సీనియర్ కోహ్లీతో మొదటగా శ్రేయస్ అలా ఎందుకు వ్యవహరించాలి అంటూ చాలా మంది ప్రశ్నించారు. దానికి విరాట్ సరైన బుద్ధి చెప్పాడంటూ కామెంట్లు చేశారు. ఇదంతా తెలిసిన విషయమే కదా, సోషల్ మీడియాలో దీన్ని చూసేశాం.. ఇప్పుడెందుకు చెబుతున్నారు అని అనుకుంటున్నారా? అయితే కంటికి కనిపించిన ఇదంతా అబద్ధం అని తెలిసింది. ఇదంతా కొంతమంది ట్రోలర్స్.. క్రికెట్ అభిమానులను తప్పుదోప పట్టించేందుకు చేసిన ప్రయత్నమిది. అవును మీరు చదువుతోంది నిజం. ఈ విషయం తెలీక చాలా మంది నిజంగానే కోహ్లీ-అయ్యర్ మధ్య ఏదో గొడవ జరిగినట్లు నమ్ముతున్నారు. వాస్తవానికి అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..అసలు జరిగిందేంటంటే? శ్రేయస్ అయ్యర్ చేసుకున్న సంబరాలు నిజమే. కానీ అది ఆర్సీబీపై కాదు. కేకేఆర్ పై లోయెస్ట్ టోటల్ డిఫెండ్ చేశాక శ్రేయస్ అయ్యర్ అలా సంబరాలు చేసుకున్నాడు. ముల్లాన్‌పుర్‌లో ఏప్రిల్ 15న ఈ మ్యాచ్ జరిగింది. ఆ వీడియోను ఎడిట్ చేసి, ఆర్సీబీపై అయ్యర్ అలా చేశాడంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. కానీ ఐపీఎల్ అఫీషియల్ పేజ్ చెక్ చేస్తే.. అసలు విషయం బయట పడింది. ఐపీఎల్ పేజులో ఏప్రిల్ 15న కేకేఆర్ పై శ్రేయస్ ఆ సంబరాలు చేసుకున్నట్లు పక్కాగా వీడియో ఆధారం ఉంది. కాబట్టి ఈ కాంట్రవర్సీ సెలబ్రేషన్స్ లో శ్రేయస్ అయ్యర్ తప్పేమీ లేదు.ఇది తెలుసో తెలీకో.. ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా శ్రేయస్ అయ్యర్ ను తప్పుబడుతున్నారు. వైరల్ అవుతోన్న మిస్ లీడ్ రీల్ ను మరింత స్ప్రెడ్ చేస్తూ లేని పోని అపోహలు సృష్టిస్తున్నారు. దీంతో చాలా మంది క్రికెట్ అభిమానులు.. విరాట్ కోహ్లీ – శ్రేయస్ అయ్యర్ మధ్య నిజంగానే మనస్ఫర్థలు వచ్చాయని అనుకుంటున్నారు. ఏదేమైనా ఈ మిస్ లీడ్ రీల్ వల్ల.. మన ఇండియన్ ప్లేయర్స్ పై హేట్ క్రియేట్ అవుతోంది. ముఖ్యంగా కోహ్లీ – శ్రేయస్ అయ్యర్ ఫ్రెండ్ షిప్‌ను తప్పుగా అనుకుంటున్నారు. నిజానికి వారిద్దరు చాలా మంచి స్నేహితులు. మ్యాచ్ అయ్యాక కూడా వారిద్దరు ఎంతో కలిసి మెలిసి ఉన్నారు. ఇక కోహ్లీ విషయానికొస్తే.. అతడు ఎప్పటిలాగే సరదాగా చేసుకున్న సెలబ్రేషన్స్ తప్ప.. శ్రేయస్ అయ్యర్ పై రివెంజ్ కాదని తెలిసింది

Related Posts

రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, 15 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన మణికొండ మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు

నాగోల్ మన న్యూస్ ;- తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిజెఆర్ జిహెచ్ఎంసి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, అండర్ 15 టోర్నమెంట్ లో మణికొండ మ్యాచ్ పాయింట్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్స్ తమ సత్తా…

సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు విజేతగా నిలిచి 40 వేల రూపాయలు గెలుపు పొందడం జరిగింది. ఎస్ఆర్ పురం మండలం u.m. పురం గ్రామంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్లో యు.ఎం. పురం క్రికెట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 5 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..