

Mana News, మహేశ్వరం: భూభారతి ద్వారా భూసమస్యలకు పరిష్కారం లభిస్తుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. భూభారతి అమల్లో భాగంగా మహేశ్వరంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్తచట్టం ద్వారా కార్యాలయాల చుట్టూ రైతులు తిరగాల్సిన అవసరం లేదన్నారు. ఈ చట్టంపై రైతులందరూ పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.