Mana News :- హైదరాబాద్‌: పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)లో సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైంది. మంత్రి సీతక్క ఆదేశాలతో సెర్ప్‌లో వందశాతం బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం సెర్ప్‌లో 3,974 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సంస్థలో సాధారణ బదిలీలు జరిగి పదేళ్లయిన నేపథ్యంలో ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం బదిలీలకు ఆమోదం తెలిపింది. పనుల్లో వేగం పెంచేందుకు బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *