


.మన న్యూస్,నిజాంసాగర్,నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామంలో గల హనుమాన్ మందిరంలో సప్త కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ప్రత్యేక పూజలు,హోమాలు,భజనలు, సప్తాహపారాయణతో ఆలయం భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హనుమాన్ స్వామిని దర్శించుకున్నారు.భక్తి, సమర్పణతో స్వామివారికి పూజలు నిర్వహించారు.ఈ తరహా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో నైతిక విలువలను పెంపొందించేందుకు తోడ్పడతాయని అన్నారు.
వేదికపై జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో గ్రామ పెద్దలు, నాయకులు,పండితులు పాల్గొని భక్తులకు స్ఫూర్తిదాయక సందేశాలు అందించారు.అనంతరం అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
