ఘనంగా మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి వేడుకలుఫూలే దంపతుల విగ్రహం వద్ద ఘన నివాళి

నర్వ మండలం ఏప్రిల్ 11 ( మన న్యూస్)ఎందరో మహనీయుల పోరాట ఫలితంగానే అన్ని హక్కులు సాధించుకోగలిగామని,ఆ మహనీయుల్లో మహాత్మా జ్యోతి రావు ఫూలే ఆదర్శప్రాయుడని ఉపాద్యాయులు యం.మల్లేశ్,ఉస్మాన్ అన్నారు.శుక్రవారం ఫూలే జయంతిని పురస్కరించుకుని నర్వ మండల పరిధిలోని రాయికోడ్ గ్రామంలో పూలే కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు వారు హాజరయ్యారు.ఫూలే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.అంటరానితనం,కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి తన జీవితాన్ని వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అంకితం చేసిన మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతిని రాయికోడ్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు.పూలే విగ్రహ వ్యవస్థాపకులు యం.శంకర్ ఆధ్వర్యంలో గ్రామంలోని పూలే దంపతుల విగ్రహాలకు గ్రామపెద్దలు,యువకుల సమక్షంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లేష్ మాట్లాడుతూ కుల,మత,వర్గ,వర్ణంతో ముడిపడిన మూఢాచారాలు,సామాజిక కట్టుబాట్లు అనే సంకెళ్లను తెంపి,సమసమాజ స్థాపనకు ఎనలేని కృషి చేసి భారత దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహాత్మ జ్యోతిరావు పూలే జీవితం మనందరికీ ఆదర్శం అన్నారు.ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యుడు పూలే అని ప్రశంసించారు.విద్యతోనే సమసమాజ స్థాపన,అభివృద్ధి సాధ్యమని నమ్మి ఆ దిశగా విశేష కృషి చేసిన గొప్ప దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు.భారతదేశ చరిత్రలోనే బాలికల కోసం సొంతంగా ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పి స్త్రీ విద్యా వ్యాప్తికి విశేష కృషి చేసిన గొప్ప విద్యావేత్త జ్యోతి బాపూలే అన్నారు.ఆనాటి ఆధిపత్య వర్గాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మొక్కవోని దీక్షతో తన భార్య సావిత్రిబాయి పూలే కు స్వయంగా చదువు చెప్పి,ఉపాధ్యాయ శిక్షణను ఇప్పించి తాను నెలకొల్పిన పాఠశాలల్లో ఆమె ద్వారా విద్యా బోధన చేయించటం జరిగిందన్నారు.సమాజంలో కులవ్యవస్థ నిర్మూలనకోసం,స్త్రీ,పురుషులకు సమాన హక్కుల కోసం ఎంతగానో పోరాడిన సామాజిక యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే చూపిన బాటలో మనమంతా నడవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో రాయికోడ్ హెడ్ మాస్టర్ రాయల్ హెన్నా, ఉపాధ్యాయురాలు రాధారాణి పూలే కమిటి వ్యవస్థాపకులు,అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు యం.శంకర్,మాజీ ఎంపిపి కొండా జయరాములు శెట్టి,వివిధ పార్టీల ముఖ్య నాయకులు కె.యన్.స్వామి,ఎం.నారాయణరెడ్డి,మన్సూర్ పాష,నౌసు వెంకటయ్య,పి అంజి,బి.రవి కుమార్,పూలే కమిటీ సభ్యులు పి.రవి కుమార్,ముస్టిపల్లి రామాంజనేయులు గౌడ్,వార్డు సభ్యులు రాము,భీమేష్ మేస్త్రి,నర్సన్ గౌడ్,సీపూర్ ఈశ్వర్,యువకులు టి.రమేష్,కే. నారి,బి.శివశంకర్,కే.చింటూ,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///