

మనన్యూస్,ఏలేశ్వరం:దుర్గా శ్రీనివాస్ఈ నెల 6వ తారీఖున భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాకినాడ జిల్లా పూర్వపు అధ్యక్షుడు చిలుకూరి రాంకుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ జరగాలని కార్యకర్తలకు సూచించారు.కాకినాడ జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మిడి వెంకటరావు మాట్లాడుతూ సంస్థ గత ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ప్రత్తిపాడు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు పైల సుభాష్ చంద్రబోస్, బిజెపి కౌన్సిల్ మెంబర్ కర్రి ధర్మరాజు,ప్రతిపాడు నియోజకవర్గ సీనియర్ నాయకులు వెలుగుల హరే రామ్,ఏలేశ్వరం టౌన్ అధ్యక్షులు పైల అయ్యప్ప,రూరల్ అధ్యక్షులు నీలి సురేష్, రూరల్ యువ మోర్చా పూర్వపు అధ్యక్షులు కూరాకుల రాజా,ముల్ల మాధవ్,ఆలేటి నాగేశ్వరరావు,గొడుగు నల్లబ్బాయి తదితరులు పాల్గొన్నారు.
