

ఉదయగిరి కోటను పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుతా.. !
ఉదయగిరి లోని ఈద్గా మసీదులో రంజాన్ ఈద్ – ఉల్ – పీతర్ సమాజ్ ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!
ఈద్గా వద్ద రంజాన్ సమాజ్ ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరులకు శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మజ్జిగ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్,పంపిణీ..!
మనన్యూస్,ఉదయగిరి:ముస్లిం సోదరుల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తానని అదేవిధంగా ఉదయగిరి కోటను పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుతానని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు.సోమవారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయగిరిలోని ఈద్గా మసీదులో జరిగిన రంజాన్ ఈద్ – ఉల్ – పీతర్ సమాజ్ ప్రార్థనలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు.అనంతరం ముస్లిం సోదరులను అలీంగణం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్వమత ఐకమత్యం సద్భావన సర్వ మానవ సమతకు ప్రతీక రంజాన్ పర్వదినం అని తెలిపారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన రంజాన్ మాసం అంతా ముస్లిం సోదరులందరూ నెల రోజులపాటు నియమ నిష్టలతో కఠోర ఉపవాస దీక్షలతో అల్లాహ్ ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగించడం గొప్ప విషయం అన్నారు. అల్లాహ్ రక్షణ కరుణ పొందుటకు రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ పేద ధనిక అన్న తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు ఉన్నదానిలో ఎంతో కొంత సహాయం చేస్తూ సేవా దృక్పధాన్ని చాటుతూ రంజాన్ పండుగను జరుపుకుంటారన్నారు. రంజాన్ పర్వదినం లో ముస్లిం సోదరుల కుటుంబాలలో సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో వెళ్లి విరియాలని అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అందరూ ఐకమత్యంతో కుల మతాలకు అతీతంగా సోదర భావాలతో అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అదేవిధంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, నా ముందు ఉన్న లక్ష్యాలను చేరుకుంటానని తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రార్థనలకు వచ్చే ముస్లిం సోదరులందరికీ మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, శీతల పానీయాలను, శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, ట్రస్ట్ చైర్మన్ ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ అందజేశారు. ఎస్ కే రియాజ్ నివాసంలో ఎమ్మెల్యే రంజాన్ విందును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు కూటమి నేతలు, తదితరులు ఉన్నారు.
