Mana News, Nellore :- శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు నందు బ్రహ్మోత్సవాలు భాగంగా సోమవారం ఉదయం 4.40గంIIలకు ధ్వజారోహణ కార్యక్రమము జరిగినది. ఉభయకర్తలు ‘’పద్మశాలి బహుత్తమ సంఘం తరపున శ్రీ కోలాటి శ్రీనివాసులు తదితరులు’’. శ్రీ స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణ చేసి మంగళవాయిద్యాల మధ్య ద్వజస్తంభాన్ని దర్భతో చేసిన పవిత్ర దర్భాన్ని, వస్త్రాన్ని ధ్వజస్తంభానికి అలంకరించి ప్రత్యేక పూజలు చేసారు. దూపదీప నైవేద్యాన్ని సమర్పించి ధ్వజారోహణ నిర్వహించారు. తరువాత శ్రీ స్వామి అమ్మవార్లను ఉత్సవంను పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమమునకు ఆలయ ఈఓ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి మరియు దేవస్థాన సిబ్బంది మరియు అర్చకులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *