నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు (మార్చి 9) 105 శంకుస్థాపన లు కార్యక్రమం

నెల్లూరు రూరల్,మన న్యూస్, మార్చి 8 :- నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు 105 శంఖుస్థాపనలు.
రేపు ఉదయం (తే.09.03.2025ది) 6.30గం॥లకు ప్రారంభం. *తరువాత వారం పాటు 198 శంకుస్థాపనలు.
*60 రోజుల్లో పనులు పూర్తిచేసి, ప్రజలకు అంకితం చేస్తాం. *రేపటి శంఖుస్థాపన కార్యక్రమంలో ప్రజలే అతిథులు, ప్రారంభకులు. *రూరల్ ఎమ్.ఎల్.ఏ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడి. నెల్లూరు రూరల్ ఎమ్.ఎల్.ఏ. కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు రూరల్ ఎమ్.ఎల్.ఏ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ…….. రేపు ఒక్కరోజే మార్చి 9 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 105 చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేస్తున్నామని, ఆదివారం ఉదయం 6.30 గం||లకు వివిధ ప్రాంతాలలో ప్రారంభం అవుతాయని, ప్రతి చోట కూడా స్థానిక ప్రజలే ఈ శంఖుస్థాపనలు చేస్తారని, ప్రజలే అతిధులు. రూరల్ ఎమ్.ఎల్.ఏ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని అన్నారు. ఈ 105 శంఖుస్థాపనలలో కొన్ని చోట్ల నేను, మరికొన్ని చోట్ల కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మరికొన్ని చోట్ల మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, మరికొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, క్లస్టర్ ఇన్ఛార్జులు పాల్గొని దగ్గరుండి పర్యవేక్షిస్తారు అని రూరల్ ఎమ్.ఎల్.ఏ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తరువాత వారం రోజులపాటు మార్చి 17వ తేది లోపల మరో 198 చోట్ల అభివృద్ధి కార్యక్రమాల శంఖుస్థాపనలు ఉంటాయని, మొత్తం 303 అభివృద్ధి కార్యక్రమాలు 60 రోజుల్లో పూర్తిచేసి, మే 20వ తేదీన ప్రజలకు అంకితం చేస్తాం. రూరల్ ఎమ్.ఎల్.ఏ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని అన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా నగర కార్పోరేషన్ పరిధిలో 26 డివిజన్లకు సంబంధించినవని, వీటి అంచనా విలువ షుమారు 40 కోట్ల రూపాయలని, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినతరువాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో, 18 గ్రామాలలో కలిపి 191 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాము అని రూరల్ ఎమ్.ఎల్.ఏ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. ఇంతటి అదృష్టాన్ని స్థానిక ఎమ్.ఎల్.ఏ. గా నాకు కల్పించిన భగవంతుడికి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, యువనాయకుడు నారా లోకేష్ కి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి, మునిసిపల్ శాఖా మంత్రివర్యలు పొంగూరు నారాయణ కి, అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని నెల్లూరు రూరల్ ఎమ్.ఎల్.ఏ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
అక్షరాల 60 రోజుల్లో ఈ అభివృద్ధి పనులు పూర్తిచేసి, మే 20వ తేదీన ప్రజలకు అంకితం చేస్తానని పునరుద్ఘాటించిన రూరల్ ఎమ్.ఎల్.ఏ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని తెలిపారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///