మహిళా సాధికారిత తెలుగుదేశంతోనే సాధ్యం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,మహిళల స్వయం ఉపాధి కల్పనకై ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు.మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు,విద్య,ఉద్యోగాలు,రాజకీయాల్లో రిజర్వేషన్లు టిడిపి ఘనతే.చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతోనే ఎమ్మెల్యే అయ్యాను.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి .డ్వాక్రా సంఘాల ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ రాష్టంలో మహిళా సాధికారతకు శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేనన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళలు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూరాష్ట్రంలోని ప్రతి మహిళ సామాజిక,ఆర్థిక పురోగతి సాధించాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు నాయకత్వం లోని కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మహిళలను రాజకీయంగా ప్రోత్సహించాలనే తెలుగుదేశం పార్టీ విధానంలో భాగంగా చంద్రబాబు నాయుడు చొరవతోనే తాను ఎమ్మెల్యే అయ్యానన్నారు. ఆర్థిక భారం అని తెలిసినా 2 వేల 600 కోట్ల సబ్సిడీని భరిస్తూ దీపం 2 పధకం ద్వారా 90 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారన్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలన్న ఆశయంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది మహిళలకు ఉచితంగా టైలరింగ్లో శిక్షణ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్లు అందజేసేందుకు ప్రభుత్వం 255 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు, విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా దేశంలో మహిళా సాధికారితకు కృషిన ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశమేనన్నారు. మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసే దిశగా అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ధన్యవాదాలు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ తాళ్ళపాక అనురాధ, జిల్లా తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి విజయమ్మ.టిడిపి మహిళా విభాగ నాయకురాళ్లు భూదేవి,కప్పిర పార్వతి,వనజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///