యూఏఈలో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్ష అమలు..

Mana News :- వేర్వేరు హత్య కేసుల్లో దోషులుగా తేలిన ఇద్దరు భారతీయ వ్యక్తులను యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్(యూఏఈ) మరణశిక్ష విధించిందని, వారిని ఉరి తీసిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఇద్దరు వ్యక్తుల్ని కేరళకు చెందిన మహ్మద్ రినాష్ అరంగిలోట్టు, మురళీధరన్ పెరుమ్తట్ట వలప్పిల్‌గా గుర్తించారు. యూఏఈలోని అత్యున్నత న్యాయస్థానం అయిన కాసేషన్ కోర్టు ఈ శిక్షల్ని సమర్థించిన తర్వాత వీరిద్దరిని ఉరితీసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. యూఏఈ జాతీయుడి హత్య కేసులో మహ్మద్ రినాజ్‌ని దోషిగా నిర్ధారించగా, మురళీధరన్ మరో భారతీయుడిని హత్య చేసినందుకు శిక్ష విధించింది. ఉరిశిక్షల గురించి ఫిబ్రవరి 28న యూఏఈ భారత రాయబార కార్యాలయానికి తెలియజేసింది. యూఏఈలో ఉరిశిక్ష పడిని ఇద్దర్ని రక్షించేందుకు భారత రాయబార కార్యాలయం అక్కడి ప్రభుత్వానికి క్షమాభిక్ష పిటిషన్లను పంపించి అన్ని రకాల కాన్సులర్, చట్టపరమైన సహాయాన్ని అందించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. గత నెలలో, ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన 33 ఏళ్ల యువతిని యూఏఈలో ఉరితీశారు. డిసెంబర్ 2022లో తన సంరక్షణలో ఉన్న 4 నెలల చిన్నారిని చంపిందనే అభియోగాలతో ఫిబ్రవరి 15న అబుదాబిలోని షహజాది ఖాన్‌ని ఉరితీశారు. టీకాలు వేసిన తర్వాత బిడ్డ మరణించిందని, బిడ్డ సంరక్షకురాలు షహజారి మరణానికి కారణమని బిడ్డ తల్లిదండ్రులు ఆరోపించారు.

Related Posts

ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెల్లగా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వై.ఆర్.సి కోటర్స్ వద్ద…

ఎండియు వాహనాలు కొనసాగించాలని డ్రైవర్ల ఆందోళన

గొల్లప్రోలు మే 24 మన న్యూస్ :– రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీకి వినియోగించే ఎండియు వాహనాలను తొలగించడంపై డ్రైవర్లు గురువారం గొల్లప్రోలు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.ఎండియు వాహనాలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై గొల్లప్రోలు పట్టణ,మండల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 2 views
ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 8 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్