ఎండియు వాహనాలు కొనసాగించాలని డ్రైవర్ల ఆందోళన

గొల్లప్రోలు మే 24 మన న్యూస్ :– రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీకి వినియోగించే ఎండియు వాహనాలను తొలగించడంపై డ్రైవర్లు గురువారం గొల్లప్రోలు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.
ఎండియు వాహనాలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై గొల్లప్రోలు పట్టణ,మండల పరిధిలో డ్రైవర్లు వాహనాలతో సహా స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయంపై డ్రైవర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం వైసీపీ ఇన్చార్జ్,మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ధర్నా చేస్తున్న డ్రైవర్ల వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు. కొంతసేపు ఆమె డ్రైవర్లతో ఆందోళనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు భద్రత కల్పిస్తే కూటమి ప్రభుత్వం ఏదో వంకతో తొలగించడమే పనిగా పెట్టుకుందన్నారు.ఎండియు వాహనాలు రద్దు పరచడంతో రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల రేషన్ పంపిణీ వాహనదారుల కుటుంబాలను రోడ్డున పడ్డాయన్నారు.ఎండియు డ్రైవర్లుగా అధిక శాతం బడుగు,బలహీన వర్గాలు వారే పనిచేస్తున్నారని వారి పొట్ట కొట్టే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తక్షణం వెనక్కి తీసుకోవాలని గీత డిమాండ్ చేశారు.ఎటువంటి నోటీసులు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎండియు వాహనాలను తొలగించామంటూ ప్రభుత్వం ప్రకటన చేయటం దారుణమన్నారు.వేల కుటుంబాలు జీవనాధారం కోల్పోతున్నందున వాహన డ్రైవర్ ల తొలగింపు చర్యలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మైనం రాజా, వైసిపి నాయకులు గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి, అముజూరి రాంబాబు,డ్రైవర్లు బుల్లి వెంకన్న, శ్రీనివాస్, వెంకటస్వామి,బాబీ,శివ,శ్రీను నాగేశ్వరరావు,సత్యనారాయణ, వసంతరావు,దానియేలు, వెంకటకృష్ణ,లక్ష్మణ్,రామకృష్ణ, బుల్లియ,పలువురు వైసిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెల్లగా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వై.ఆర్.సి కోటర్స్ వద్ద…

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌ను నోరు మెదపకుండా చేసిన భారత్..!

Mana News :- పాకిస్తాన్‌ను మరోసారి ఐక్యరాజ్యసమితిలో నోరు మెదపకుండా చేసింది భారతదేశం. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పదే పదే లేవనెత్తడం వల్ల ప్రపంచం ముందు అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అయినప్పటికీ తన కార్యకలాపాలను ఆపాడంలేదు. జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుతూనే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 5 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..