బెదిరింపులకు భయపడేది లేదు ! తేల్చి చెప్పిన చైనా

Mana News, Internet Desk :- బీజింగ్‌ : బెదిరింపులకు భయపడబోమని, అయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన అధిక టారిఫ్‌లు, ఇతర సవాళ్లను ఎదుర్కొనగలిగే సామర్ధ్యం తమ ఆర్థిక వ్యవస్థకు వుందని చైనా వాణిజ్య శాఖ మంత్రి వాంగ్‌ వెంటావో స్పష్టం చేశారు. వాణిజ్య యుద్ధంలో విజేతలు అంటూ ఎవరూ వుండరని వ్యాఖ్యానించారు. చైనా నేషనల్‌ కాంగ్రెస్‌ వార్షిక సమావేశం సందర్భంగా వాంగ్‌ మాట్లాడుతూ గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చలు జరిపేందుకు చైనా సిద్ధంగా వుందని పునరుద్ఘాటించారు. బెదిరింపులు, బలవంతపు చర్యలు అంతిమంగా విఫలమవుతాయని ఆయన వ్యాఖ్యానించారు.
చైనాపై ఇలాంటివి పనిచేయవని అన్నారు. తమను భయపెట్టలేరన్నారు. దేశ ప్రయోజనాలు కాపాడుకోవాలన్న చైనా కృతనిశ్చయం తిరుగులేనిదన్నారు. 140 దేశాలకు ప్రధాన వాణిజ్య భాగస్వామిగా చైనా వుందంటే తమకు అనేక అవకాశాలు వున్నాయని అర్థమని అన్నారు. తమ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మార్కెట్ల నిర్మాణానికి, బలోపేతానికి అనుసరించే వ్యూహాల గురించి ఆయన వివరించారు. జనవరి నుండి రెండుసార్లు చైనాపై ట్రంప్‌ ప్రభుత్వం టారిఫ్‌లు పెంచింది. చైనా కూడా ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై, కంపెనీలపై ఇలాంటి ఆంక్షలు విధించింది. ఇతర దేశాలతో వ్యవహారాల్లో పరస్పర గౌరవం వుండాలని చైనా ఆకాంక్షిస్తుందన్నారు., అమెరికా ఈ తప్పుడు దారిలోనే ముందుకు సాగితే తాము కూడా అదే రీతిన ప్రతిస్పందిస్తామని, చివరికంటా పోరాడతామని చెప్పారు. వాణిజ్యంపై విభేదాలుంటే పరిష్కరించుకోవడానికి చైనా సిద్ధంగా వుందన్నారు. సాధ్యమైనంత త్వరలో సముచితమైన సమయంలో ఉభయ పక్షాలు సమావేశమై సమాచార మార్పిడి చేసుకోవాలన్నారు.

Related Posts

ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెల్లగా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వై.ఆర్.సి కోటర్స్ వద్ద…

ఎండియు వాహనాలు కొనసాగించాలని డ్రైవర్ల ఆందోళన

గొల్లప్రోలు మే 24 మన న్యూస్ :– రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీకి వినియోగించే ఎండియు వాహనాలను తొలగించడంపై డ్రైవర్లు గురువారం గొల్లప్రోలు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.ఎండియు వాహనాలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై గొల్లప్రోలు పట్టణ,మండల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?