మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెల్లగా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వై.ఆర్.సి కోటర్స్ వద్ద ఉన్న రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నీరాజనాలు అర్పించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన రంగా జీవితం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం నగర పంచాయతీ తెలగ కాపు సంక్షేమ సంఘం పెద్దలు యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం పెద్దలు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా సేవలు, పేదలకు అండగా నిలిచిన తీరును పలువురు వక్తలు కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని, సమాజంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు భక్తిపూర్వక వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా రంగా అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. రంగా రాజకీయ, సామాజిక సేవలు యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమం రంగా స్మృతులను నీరాజనం చేస్తూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్పానికి ప్రతీకగా నిలిచింది.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *