అమెరికా కూడా యుద్ధానికి సిద్ధం.. చైనా హెచ్చరికపై స్పందించిన రక్షణ మంత్రి

Mana News, Internet Desk :- చైనాతో ఎలాంటి పోరాటానికైనా తమ దేశం సిద్ధంగా ఉందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ అన్నారు. చైనాతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు పీట్ హెగ్సేత్ మాట్లాడారు.అమెరికాతో చివరి వరకు ఎలాంటి యుద్ధం చేసినా పోరాడతామని చైనా చేసిన ప్రకటన తర్వాత ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ట్రంప్ సుంకాలను ప్రకటించిన తర్వాత రెండు దేశాల మధ్య ఈ ఉద్రిక్తత ప్రారంభమైంది. ఇది ప్రపంచంలోని రెండు అతిపెద్ద శక్తులైన అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. దీని కారణంగా రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.ట్రంప్ ప్రభుత్వం చక్కెర దిగుమతులపై సుంకాన్ని రెట్టింపు చేసి 20 శాతానికి పెంచింది. దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 10 నుంచి 15 శాతం సుంకాలను విధించింది. అలాగే 25 అమెరికన్ కంపెనీలను చైనాలో నిషేధించారు. చైనా చాలా కఠినమైన ప్రకటన చేస్తూ.. అమెరికాతో ఎలాంటి యుద్ధానికైనా మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పింది. “ఫెంటానిల్ సమస్యను నిజంగా పరిష్కరించాలని అమెరికా కోరుకుంటే, చైనాతో సమాన స్థాయిలో చర్చలు జరపాలి. కానీ, అమెరికా యుద్ధం కోరుకుంటే – అది టారిఫ్ వార్ అయినా, ట్రేడ్ వార్ అయినా, లేదా మరే ఇతర యుద్ధమైనా – మేము తుది వరకు పోరాడేందుకు సిద్ధం” అని చైనా రాయబార కార్యాలయం ట్విట్టర్ వేదికగా తేల్చి చెప్పింది.స్పందించిన అమెరికా రక్షణ మంత్రి :- చైనాతో యుద్ధానికి అమెరికా కూడా సిద్ధంగా ఉందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ అన్నారు. సంఘర్షణను నివారించడానికి సైనిక బలం కీలకమని.. అందుకే మా సైన్యాన్ని పునర్నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. చైనాతో లేదా ఎవరితోనైనా యుద్ధం రాకుండా నిరోధించాలనుకుంటే మనం బలంగా ఉండాలన్నారు. శాంతి బలం నుంచి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అర్థం చేసుకున్నారని చెప్పారు. కఠినమైన వాక్చాతుర్యం ఉన్నప్పటికీ ట్రంప్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో మంచి సంబంధం ఉందని పీట్ హెగ్సేత్ అన్నారు.అమెరికా, చైనా మధ్య వివాదానికి వాణిజ్యం ఒక్కటే కారణం కాదు. అమెరికాలోకి ఫెంటానిల్ ప్రవాహాన్ని ఆపడంలో చైనా విఫలమైందని వైట్ హౌస్ ఆరోపించింది. చైనా అధికారులు దీనిని తిరస్కరిస్తున్నారు. ఫెంటానిల్ సంక్షోభానికి అమెరికానే కారణమని వారు వాదిస్తున్నారు. సుంకాల పెంపును సమర్థించుకోవడానికి ఫెంటానిల్ సంక్షోభాన్ని అమెరికా సాకుగా ఉపయోగిస్తోంది చైనా ఆరోపించింది.

Related Posts

ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెల్లగా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వై.ఆర్.సి కోటర్స్ వద్ద…

ఎండియు వాహనాలు కొనసాగించాలని డ్రైవర్ల ఆందోళన

గొల్లప్రోలు మే 24 మన న్యూస్ :– రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీకి వినియోగించే ఎండియు వాహనాలను తొలగించడంపై డ్రైవర్లు గురువారం గొల్లప్రోలు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.ఎండియు వాహనాలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై గొల్లప్రోలు పట్టణ,మండల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?