

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:కాకినాడ జిల్లా కరప మండలం సిరిపురం గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన కిర్లంపూడి సూర్యనారాయణ (75) గత కొన్ని రోజుల నుండి యర్రవరం జాతీయ రహదారి లో దీన స్థితిలో ఉండటంతో వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు వారి బృందంతో కలిసి అతనిని వివరాలు అడిగి తెలుసుకుని,ప్రత్తిపాడు శారదా వయో వృద్ధాశ్రమంలో చేర్పించారు.
అనారోగ్యకారణంగా ఆయనని మంగళవారం రాత్రి వివేకానంద సేవా సమితి సభ్యులు ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఆరోగ్యం క్షీణించడంతో సూర్యనారాయణ మృతి చెందారు.విషయం తెలుసుకున్న వివేకానంద సేవాసమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అనాధ శవానికి అన్ని తానై అంతిమ సంస్కారాలు చేసి ఖననం చేశారు
చేసి మానవత్వం చాటుకున్నారు.ఈ అంతిమ ఖననం కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్,తొమ్మిదో వార్డ్ టిడిపి ఇంచార్జ్ బుగతా శ్రీను,హెడ్ కానిస్టేబుల్ పాండ్రంకి రామకృష్ణ,రాతికింద సతీష్, అడపా సుబ్రహ్మణ్యం,తాపీమేస్త్రి శంకర్,కర్రి రాంబాబు,పెండ్యాల రాజు,స్వీపర్లు అల్లం శివ, బంగారు దుర్గారావు పాల్గొన్నారు.