

కమాండ్ కంట్రోల్ రూమ్,,చిల్డ్రన్ పార్కులను సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని,ప్రారంభించిన
మల్టీ జోన్1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి
మనన్యూస్,కామారెడ్డి:సీసీ కెమెరాలను ప్రతి ఒక్కరు భాధ్యతగా భావించి ఏర్పాటు చేసుకోవాలని సీసీ కెమెరాలను,దేవునిపల్లి పోలీస్ స్టేషన్ చిల్డ్రన్ పార్కును,సదాశివ నగర్ సర్కిల్ ఆఫీసును మల్టి జోన్1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి,ప్రారంభించారు అన్నారు.సీసీ కెమెరాల ఆధారంగా అనేక కేసులు చేదించవచ్చునని,సీసీ కెమెరాలు ఉన్న చోట దొంగతనాలు జరగవని ఆయన తెలిపారు.కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూం ను పట్టణ పోలీస్ స్టేషన్ లో మల్టి జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్ర శేఖర్ రెడ్డి,ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ,ఏఎస్పీ చైతన్య రెడ్డి,అడిషనల్ ఎస్పీ నరసింహరెడ్డి సిఐలు ఎస్ఐలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా మల్టి జోన్ ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో దొంగతనాలు జరిగే అవకాశం తక్కువ ఉంటుందని అన్నారు.ఎన్నో కేసులు చేదించడంలో సీసీ కెమెరాలు పాత్ర ఉందని అన్నారు.పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను సన్మానించారు. అనంతరం చిల్డ్రన్ పార్కులను సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించి చిన్నపిల్లలకి మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి చిల్డ్రన్ పార్కులను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు పోలీస్ స్టేషన్లోకి వచ్చే ప్రజలు తమ సమస్యలను అధికారులకు తెలియజేసే విధంగా పోలీసులు ప్రజల కొరకు పనిచేస్తున్నారని తెలియజేశారు కార్యక్రమంలో సిఐలు ఎస్సైలు కానిస్టేబులు పాల్గొన్నారు.