తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ 11వ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి

మనన్యూస్,హయత్‌నగర్‌:హయత్‌నగర్‌లో బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్11వ రాష్ట్ర మహాసభ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముద్దగోని రాంమోహన్ గౌడ్ కూడా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ,ఆర్టీసీ కార్మికులు గతంలో కాంగ్రెస్ పార్టీకి అందించిన మద్దతు మరువలేనిది.
ఆ సహకారాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం అని అభినందించారు.రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గౌరవ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిరంతరం శ్రమిస్తున్నారని ప్రశంసించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలోని పేద ప్రజల జీవితాలను మెరుగుపరచడం కోసం అహర్నిశలు కష్టపడుతున్న నేతలుగా పేరు పొందారని పేర్కొన్నారు.పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరగా తెలుసుకుని, వాటికి శాశ్వత పరిష్కారాలు చూపే దిశగా నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమాన్ని ముఖ్య లక్ష్యంగా తీసుకుని పలు వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారు, పేద ప్రజల సంక్షేమం కోసం అన్ని వనరులను సమర్ధవంతంగా వినియోగిస్తున్నారని వెల్లడించారు.అలాగే, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయడంలోనే కాకుండా,ఆర్థికంగా వెనుకబడిన ప్రజల జీవితాలను మెరుగుపరచడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు.పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు రవాణా ఖర్చులు తగ్గించడం,అధునాతన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యల ద్వారా మార్పు తీసుకొస్తున్నారని అభినందించారు.విశ్రాంత ఉద్యోగులకు ఆఫీస్ కొరకు హైదరాబాదులో జీఎచ్ఎంసి పరిధిలో స్థలం చూసుకుంటే, ముఖ్యమంత్రి రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి భవన నిర్మాణం చేపించే బాధ్యత తీసుకుంటా.లేదంటే మా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో 1000 చ„గజాల స్థలాన్ని ఇప్పించి మున్సిపాలిటీ నిధులతో భవనం కట్టిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నందు వివిధ శాఖలలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారు తెలంగాణ రాష్ట్రంలో 32,000 మంది ఉన్నారు. దాదాపుగా ఉద్యోగ విరమణ చేసినవారికి పెన్షన్ లేనందువలన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. విశ్రాంత ఉద్యోగులు అందరికీ ఆసరా పెన్షన్ తెల్లరేషన్ కార్డులు, టి.జి.యస్.ఆర్.టి.సి. సూపర్ లగ్జరీ సర్వీసులలో విశ్రాంత ఉద్యోగుల భార్యా భర్తలకు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత ప్రయాణ సౌకర్యం లాంటి అంశాలు ముఖ్యమంత్రి రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చూపిస్తానని హామీ ఇచ్చారు.సభ ఖర్చుల నిమిత్తం కొంత ఆర్ధిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో రహ్మాన్ సోఫీ,కోటయ్య రాజయ్య,ఆనందం,బుచ్చి రెడ్డి,సత్యనారాయణ చారి,యూసఫ్,కాంగ్రెస్ నాయకులు భాస్కర చారి, పన్యాల జైపాల్ రెడ్డి,జేబీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///