సంక్రాంతి సందర్భంగా విజువల్ వండర్ “కుంభస్థలం” టైటిల్ పోస్టర్ విడుదల !!!

Mana News:- ఏకెఎస్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం కుంభస్థలం. రాకీ శర్మన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు, అజార్ షైక్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అజయ్ ఘోష్, అర్చన, దివి, బాహుబలి ప్రభాకర్, నాగ మహేష్, బలగం సంజయ్, చిత్రం శ్రీను, వెంకటేష్ ముమ్మిడి, వినోద్ కుమార్ ఆల్వ, దిల్ రమేష్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. డివైన్ మైతలజికల్ జానర్ లో తెరకెక్కుతున్న కుంభస్థలం సినిమా టైటిల్ పోస్టర్ ను సంక్రాంతి సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేశారు. దాదాపు సగం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పుణె, ముంబై, అలీ బాగ్, మహాభళేశ్వర్, హైదరాబాద్ లలో అందమైన లొకేషన్స్ లో ఈ మూవీని షూట్ చెయ్యడం జరిగింది.గ్రాఫిక్స్, యానిమేషన్స్ , విఎఫ్ఎక్స్ ఈ సినిమాలో ప్రధానంగా హైలెట్ కాబోతున్నాయి. అందుకు ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత అజార్ షేక్ నిర్మిస్తున్నారు. ఎమ్ ఎల్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు శిరీష్ ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు రాకీ శర్మన్ కుంభస్థలం సినిమాను విజువల్ వండర్ గా ఈ మూవీని చిత్రీకరిస్తున్నారు. త్వరలో ఈ మూవీ ఫస్ట్ లుక్ ను త్వరలో విడుదల చేయబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

  • Related Posts

    మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

    Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ..సబ్ కలెక్టర్ కిరణ్మయి

    • By RAHEEM
    • July 2, 2025
    • 2 views
    తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ..సబ్ కలెక్టర్ కిరణ్మయి

    విద్యార్థిని విద్యాభ్యాసం కన్నతల్లి నుండే ప్రారంభం…

    విద్యార్థిని విద్యాభ్యాసం కన్నతల్లి నుండే ప్రారంభం…

    శంఖవరం మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎపి ఫుడ్ కమీషన్ సభ్యులు..

    శంఖవరం మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎపి ఫుడ్ కమీషన్ సభ్యులు..

    సుపరిపాలనకు…తొలి అడుగు విజయవంతం చేయండి…

    సుపరిపాలనకు…తొలి అడుగు విజయవంతం చేయండి…

    ఖరీఫ్ 2025 కోసం ఎస్ .బి.ఐ జనరల్ ఇన్సూరెన్స్ తొమ్మిదో పంట బీమా వారం అవగాహన కార్యక్రమం

    ఖరీఫ్ 2025 కోసం ఎస్ .బి.ఐ జనరల్ ఇన్సూరెన్స్ తొమ్మిదో పంట బీమా వారం అవగాహన కార్యక్రమం

    7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…

    7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…