థ్రిల్లర్ మూవీ “హైడ్ న్ సీక్” ఇప్పుడు అహలో స్ట్రీమింగ్ !!!

Mana News:- సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన హైడ్ న్ సీక్ సినిమా ఇటీవల థియేటర్స్ లో విడుదలై మంచి రివ్యూస్ తో పాజిటీవ్ టాక్ తో ప్రేక్షకాదరణ పొందింది, విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా బసి రెడ్డి రానా దర్శకుడిగా పరిచయం అయ్యారు. నరేంద్ర బుచ్చి రెడ్డిగారి నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతొంది.సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ముఖ్య పాత్రలు పోసించిన ఈ మూవీ సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ గా దర్శకుడు బసిరెడ్డి రానా తెరకెక్కించారు, ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత నరేంద్ర బుచ్చి రెడ్డిగారి ఈ మూవీని నిర్మించారు.ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్స్ కు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. మొదటి సీన్ నుంచి సినిమా అయిపోయే వరకు ప్రేక్షకుడిని సీటులోంచి కదలనీయకుండా చేయడంలో దర్శకుడు మంచి సస్పెన్స్ మెయింటెన్ చేసాడు. ఆ మధ్య బ్లూవేల్ గేమ్ అని బాగా ట్రెండ్ అయింది. అలాంటి ఒక గేమ్ పిల్లలనే కాదు యువకులను కూడా ఎలా బానిసలుగా చేసి వారి లైఫ్ లతో ఎలా ఆడుకుంటుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. మొదటి మర్డర్ నుంచి విరామం వరకు స్క్రీన్ ప్లే ఎంతో గ్రిప్పింగ్ రాసుకున్నారు. తరువాత ఏం జరగబోతుందో ఎవరి ఊహలకు అందనంతగా చక్కగా తెరపై ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. వరుస మర్డర్లు ఎందుకు జరగుతున్నాయి. దాని వెనకాల ఉన్న మోటివ్ ఏమిటన్నది ఈ సినిమాలో అసలు ట్విస్ట్. కథలో భాగంగా సినిమాలో క్యారెక్టర్స్ డిజైన్ చేయడం బాగుంది. పురాణాలలో ఒక కథకు లింక్ చేస్తూ చెప్పే విధానం ఆకట్టుకుంది. థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు హైడ్ న్ సీక్ సినిమాను ఆహా ఓటిటిలో చూడవచ్చు.నటీనటులు: విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ, సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి, సుమంత్ తదితరులుబ్యానర్: సహస్ర ఎంటర్టైన్మెంట్స్సమర్పణ: నిశాంత్ ప్రెజెంట్స్దర్శకత్వం: బసిరెడ్డి రానానిర్మాత: నరేంద్ర బుచ్చి రెడ్డిగారిసినిమాటోగ్రఫీ: చిన్న రామ్మ్యూజిక్: లిజో కె జోష్ఎడిటర్: అమర్ రెడ్డి కుడుములఆర్ట్: నిఖిల్ హాసన్

  • Related Posts

    మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

    Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ..సబ్ కలెక్టర్ కిరణ్మయి

    • By RAHEEM
    • July 2, 2025
    • 2 views
    తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ..సబ్ కలెక్టర్ కిరణ్మయి

    విద్యార్థిని విద్యాభ్యాసం కన్నతల్లి నుండే ప్రారంభం…

    విద్యార్థిని విద్యాభ్యాసం కన్నతల్లి నుండే ప్రారంభం…

    శంఖవరం మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎపి ఫుడ్ కమీషన్ సభ్యులు..

    శంఖవరం మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎపి ఫుడ్ కమీషన్ సభ్యులు..

    సుపరిపాలనకు…తొలి అడుగు విజయవంతం చేయండి…

    సుపరిపాలనకు…తొలి అడుగు విజయవంతం చేయండి…

    ఖరీఫ్ 2025 కోసం ఎస్ .బి.ఐ జనరల్ ఇన్సూరెన్స్ తొమ్మిదో పంట బీమా వారం అవగాహన కార్యక్రమం

    ఖరీఫ్ 2025 కోసం ఎస్ .బి.ఐ జనరల్ ఇన్సూరెన్స్ తొమ్మిదో పంట బీమా వారం అవగాహన కార్యక్రమం

    7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…

    7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…