

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:చిన్నింపేట జీడిపిక్కల కార్మికులు నిరసన శుక్రవారం 49 వ రోజుకు చేరుకుంది. కార్మికులు యాజమాన్య,ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మికులు ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ యాజమాన్యం చట్ట వ్యతిరేకంగా పరిశ్రమను మూసివేసి వెళ్లిపోవడం జరిగిందని దీనికి ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేవని దీనిపై అనుమతులు లేకుండా మూసివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని కార్మికులకు ఉపాధి కల్పించాలని అన్నారు.పలుసార్లు అధికారులకు,నాయకులకు మొరపెట్టుకున్న వారిలో స్పందన ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే ప్రభుత్వం స్పందించి కార్మికులకు ఉపాధి కాపాడాలని ఉన్న పరిశ్రమను అవసరమైతే ప్రభుత్వం తీసుకొని నడిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు ఎ.వీరబాబు,గోవిందు,కృష్ణ రావు,ధర్మజీ,ఒ.దుర్గప్రసాద్,గోపి,లోవరాజు,శివ,జయలక్ష్మి,అన్నపూర్ణ,ఒ.దుర్గ,చంటి,శివాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.