అంతర్జాతీయ పురుషుల దినోత్సవం: విద్యార్థులకు విలువలు నేర్పిన కె.గొల్లపల్లె హైస్కూల్

యాదమరి, మన ధ్యాస నవంబర్ 19: యాదమరి మండలంలోని కె.గొల్లపల్లె హైస్కూల్‌ ప్లస్‌లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాన్ని హెడ్‌మిస్ట్రెస్ కం ప్రిన్సిపాల్ ఎ.పి. లలిత ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులు ప్రత్యేకంగా నిర్వహించారు. పాఠశాల చివరి 30 నిమిషాలు ఈ వేడుకకు కేటాయించి, పురుష ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా వారికి బట్టలు, బహుమతులు, స్వీట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన హెచ్‌.యం. లలిత మాట్లాడుతూ, “అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ప్రత్యేకత ఏమిటి, చరిత్రలో ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటి అనేది విద్యార్థులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో లోకజ్ఞానం పెంపొందించడంతో పాటు పెద్దల పట్ల గౌరవభావం, తోటి వారిపట్ల మర్యాద, క్రమశిక్షణను అలవర్చేలా చేస్తాయి” అని పేర్కొన్నారు. ఇన్‌చార్జి భాస్కర రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు కనకాచారి మాట్లాడుతూ, “అటువంటి వినూత్న కార్యక్రమాలు ఉపాధ్యాయులు – విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని మరింత బలపరుస్తాయి. మంచి విద్యాభ్యాసం సాగడానికి ఇవి దోహదం చేస్తాయి” అని సంయుక్తంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 17 మంది పురుష ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.
‎అలాగే ఉపాధ్యాయులు — భాస్కర రెడ్డి, కనకాచారి, మధుసూధన్, మధన్ మోహన్ రెడ్డి, దామోదర రెడ్డి, సుధాకర్, మహేష్ షణ్మగం, చిన్నదొరై, రాకేష్ రంగనాధం, చిట్టిబాబు, నాగభూషణం, రాజా, శరత్, హేమంత్, ఆషా, కె.భారతి, మంజుల, మంజులత, భారతి, రాజేశ్వరి, రమాదేవి, కుమారి హిమబిందు, అరుణ, అక్తర్, శర్మిల, హేమాకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

చిత్తూరు డిసెంబర్ 7 మన ధ్యాస ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయాన్ని బీవీ రెడ్డి కాలనీలో వారి నివాసంలో సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించిన చిత్తూరు జిల్లా…

ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

బంగారుపాళ్యం డిసెంబర్ 7 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాళ్యం మండల కేంద్రంలో అరగొండ రోడ్డు డాక్టర్ లీలమ్మ ఆసుపత్రి ఎదురుగా అత్యాధునిక పరికరాలతో చీకూరు అర్చన చంద్రశేఖర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ మా గోల్డెన్ జిమ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

నవోదయ మోడల్ టెస్ట్‌కు విశేష స్పందన: శ్రీ సత్య కైలాస్ స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ.

నవోదయ మోడల్ టెస్ట్‌కు విశేష స్పందన: శ్రీ సత్య కైలాస్ స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ.

జవహర్ నవోదయ మెగా మోడల్ టెస్ట్‌కు తిరుమల సాయి హైస్కూల్‌లో అనూహ్య స్పందన.

జవహర్ నవోదయ మెగా మోడల్ టెస్ట్‌కు తిరుమల సాయి హైస్కూల్‌లో అనూహ్య స్పందన.