మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-సింగరాయకొండ మండలం, ములగుంటపాడు గ్రామపంచాయతీ కార్యదర్శిగా గురువారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన హనుమంతరావు మర్యాదపూర్వకంగా కలిసిన సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ మూలుగుంటపాడు గ్రామపంచాయతీ అభివృద్ధి పథంలో నడిపించి, ఎల్లప్పుడూ ప్రజలుకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని రాజేష్ కోరడం జరిగినది. హనుమంతరావు గారు మాట్లాడుతూ మూలగుంటపాడు పంచాయతీ అభివృధి చేయటం లో నా వంతు కృషి చేసి, పంచాయతీ శాఖ మంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మరియు కొండపి నియోజకవర్గం హ్యాట్రిక్ఎమ్మెల్యే మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డోలా వీర ఆంజనేయ స్వామి, మారిటైం బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారికి, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా నా పనితీరు ఉంటుంది అని కార్యదర్శి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, మరియు జన సైనికులు పాల్గొనడం జరిగినది.









