ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిలుపు.
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు విద్యాతో పాటు క్రీడానైపుణ్యం మెరుగు పరుచుకుని ఉన్నత స్థాయిలో నిలవాలని సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కత్తి శ్రీనివాసులు,చెన్నిపాడు హెచ్.ఎం ఎ. వేణుగోపాల్ రావు పిలుపు ఇచ్చారు. బుధవారం పాఠశాల క్రీడా మైదానం లో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన అందర్ 19 విభాగం లో బాలుర అథ్లెటిక్స్ పోటీలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు అవసరమైన వసతులు కల్పించడం హర్షణీయం అన్నారు. ప్రభుత్వాలు కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అకడమిక్ చదువులతో పాటు నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు వేల్పుల వెంకట్రావు మాట్లాడుతూ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పించిన వనరులతో పాటు స్థానికంగా దాతల సహకారం తో క్రీడా నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవాలని క్రీడాకారులను కోరారు. క్రీడా కారులకు సమయ పాలన,
కఠోర శ్రమ, క్రమ శిక్షణ,పోటీ తత్వం,క్రీడాస్పూర్తి తో క్రీడాకారులు సాధన చేయాలన్నారు.ఈ పోటీలలో పొన్నలూరు మండలం చెన్నిపాడు పాఠశాల పదవ తరగతి చదువుతున్న క్రీడా కారుడు డబ్బుగొట్టు మనోహర్ 400 మీటర్లు,800 మీటర్ల పరుగు పందెం లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచాడు.ఈ సందర్భంగా క్రీడాకారులు, పాఠశాల సిబ్బంది పాల్గొని అభినందించారు.







