పిల్లలు మానసిక వత్తిడికి దూరంగా దూరంగా ఉండాలి.
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపద్యం లో పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు మానసికంగా అవగాహన పెంచుకుని పటిష్ట మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసరావు పిలుపు ఇచ్చారు. ప్రపంచ మానసిక వారోత్సవాల కార్యక్రమం లో భాగంగా సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో జరిగిన కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మానసిక ఆరోగ్య కౌన్సిలర్ రావూరి లక్ష్మణ రావు నిర్వహించారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.పాఠశాల విద్యార్థులలో ఆరోగ్యకరమైన జీవన శైలి,సత్ప్రవర్తన,ఏకాగ్రత, భావోద్వేగాలు మానసిక వత్తిడి, డిప్రెషన్,ఒత్తిడి చెడు అలవాట్లు, చెడు సహవాసాలకు దూరంగా ఉండే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని పిలుపు ఇచ్చారు.విద్యార్థులు పాఠశాలల్లో ఉపాధ్యాయులు చెప్పే విషయాలు క్రమ శిక్షణ, మానసిక ఆరోగ్యం పై అవగాహన పెంచుకుంటూ భవిష్యత్తును తీర్చి దిద్దుకోవాలన్నారు.మానసిక కౌన్సిలర్ లక్ష్మణ రావు మాట్లాడుతూ విద్యార్థులు తమ లోని భావోద్వేగాలను నియంత్రించుకుంటూ జీవన శైలి మార్పు సత్ప్రవర్తన కలిగి ఉండాలని హితవు చెప్పారు. మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే వత్తిడికి దూరంగా చదువు సంధ్యలు సజావుగా సాగుతాయని వివరించారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.







