బంగారుపాళ్యం, మన ధ్యాస, అక్టోబర్ 8
అక్టోబర్ 15 బంగారు పాళ్యం మార్కెట్ యార్డులో జరిగే మామిడి రైతుల ఆక్రందన సభ జయప్రదం చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం ఆధ్వర్యంలో బుదవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగ మామిడి రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ టీ జనార్ధన్, సి. మునీశ్వర్ రెడ్డి లు మాట్లాడుతూ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 50వేల మంది మామిడి రైతులు గత నాలుగు నెలలుగా మామిడి సరఫరా చేసిన బిల్లుల కోసం పడిగాపులు పడుతున్నా చలనం లేకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా( 8+4) రూ 12 రూపాయలు చొప్పున డబ్బులు చెల్లిస్తామని చెప్పినా రాష్ట్ర, మరియు కేంద్ర నిధులు విడుదలైన చెల్లింపు విషయంలో జాప్యం ఎందుకని వారు ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా గుజ్జు ఫ్యాక్టరీ యజమానులు, ర్యాంపు నిర్వాహకులు ప్రభుత్వ నిర్ణయాన్ని బేఖాతరు చేయడం అంటే రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యమో భోద పడుతోందని వారికి గుణపాఠం చెప్పేందుకే సభను పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని వారు కోరారు. మామిడి రైతులకు ఇప్పటివరకు చెల్లించాల్సిన రూ 500 కోట్లు చెల్లించకుంటే భవిష్యత్ కార్యక్రమాన్ని, ఉద్యమ తీవ్రతను అక్టోబర్ 15న ప్రకటిస్తామని పేర్కొన్నారు. అక్టోబర్ 15 జరిగే కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల తోడ్పాటు తో పార్టీలకతీతంగా నిర్వహించబోతున్నట్లు వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుజ్జు యజమానులు, రాంపు నిర్వాహకులు నిబంధనల మేరకు రైతులు చెల్లించాల్సిన మొత్తం బకాయలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె.సురేంద్రన్, కోశాధికారి పిఎల్ సంజీవరెడ్డి ఉపాధ్యక్షులు బి. మురళి, జి. త్యాగరాజ రెడ్డి కార్యదర్శి యు. సందీప్,, తవనంపల్లె అధ్యక్షులు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు








