రేషన్ డిపో ఆడారిపాడులో ఏర్పాటు చేయాలి

మోదుగ పంచాయతీ గిరిజన ప్రజలు వినతి – తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా

మన న్యూస్, పాచిపెంట, డిసెంబర్4 :=మోదుగ పంచాయతీ అడారిపాడు గిరిజన గ్రామంలో జి సి సి రేషన్ డిపో వెంటనే ఏర్పాటు చేయాలని స్థానిక సర్పంచ్ సింహాచలం,సి పి ఎం కోరాడ ఈశ్వరరావు, 12 గ్రామాలు గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బుధవారం నాడు వారంతా కలిసి స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం తాసిల్దారు డి రవికి వారి డిమాండ్లతో కూడుకున్న మెమోరాండం అందించారు. వారి డిమాండ్లు ఇలా ఉన్నాయి. కొండలపై నుంచి మైదాన ప్రాంతాలకు నడిచి నిత్యవసర సరుకులు తీసుకురాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.జిసిసి డిపో ద్వారా బియ్యం ,పంచదార కందిపప్పు తదితర నిత్య అవసర సరుకులు అడారిపాడులో రేషన్ డిపో ఏర్పాటు చేసి ప్రజలకు అందించాలని కోరుతున్నారు. గల్లపాడు, పర్తపురం,అడారిపాడు,మెట్టవలస,లోవ, బంగారు గుడ్డి, పాయకపాడు,కాట్రగుడ్డి, గాజులు గుడ్డి,బచ్చం పాడు, ఇప్పలగుడ్డి,ఇప్ప పాడు తదితర గిరిజన గ్రామాల ప్రజలు రేషన్ డిపో కావాలని కోరుతున్నారు. మా గ్రామానికి చాలా దూరంలో ఉన్న మడవలస రేషన్ డిపో నుంచి సరుకులు తెచ్చుకొని ఇబ్బందులు పడుతున్నామని ఇకపై ఆ ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం స్పందించి అడారిపాడు గ్రామంలో డిపో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.ఐటీడీఏ పీవో,జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి గిరిజన సమస్యలు పరిష్కరించాలని గెమ్మిల బాబురావు,నాగేశ్వరావు,గెమ్మిల అప్పారావు సీతయ్య,కన్నారావు,రాంబాబు తదితరులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..