కాంగ్రెస్ చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి అందాలి.ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

మన ధ్యాస, నిజాంసాగర్: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారి, రెండు పంటలకు సరిపడా నీళ్లు అందుబాటులో ఉన్నాయని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్‌తో కలిసి ఆయన ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఇన్ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా మంజీరా నదిలోకి 1,00,243 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 100 ఏళ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్ ఉమ్మడి జిల్లాల వరప్రదాయినిగా నిలిచిందని, ఇది ప్రపంచంలోనే ప్రాముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టులలో ఒకటని తెలిపారు. మొదట్లో నీటి కొరతతో రైతులు ఆందోళన చెందారని, అయితే దేవుని కృపతో కురిసిన వర్షాలతో ప్రాజెక్టు నిండుకుండలా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. వానకాలం పంటలతో పాటు రాబోయే వ్యాసంగి పంటలకు కూడా నీరు సమృద్ధిగా ఉందని, రైతులు నిశ్చింతగా సాగు చేసుకోవచ్చని భరోసా ఇచ్చారు. యూరియా సమస్యపై మాట్లాడుతూ.. కేంద్రం నుంచి కావలసినంత యూరియా సరఫరా ఆలస్యమవుతుండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తోందని చెప్పారు. ముందుగా వరి నాట్లు వేసే నిజాంసాగర్, బాన్సువాడ, ఎడపల్లి, బోధన్, వర్ని ప్రాంతాల్లో రైతులు ముందుగానే యూరియాను సేకరించుకోవడంతో పెద్ద సమస్యలు రాలేదని వివరించారు. తాజా వర్షాల కారణంగా కొంతమంది రైతులు నష్టపోయిన విషయమై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటోందని, అధికారులు సక్రమంగా వివరాలు సేకరించి లబ్ధి చేకూర్చేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్శనలో జంగం గంగాధర్, నార్ల సురేష్, ఎజాస్, ఆర్‌.కే. రామకృష్ణ, సయ్యద్ రజావుల్లా, మోహన్ నాయక్, నీటిపారుదల శాఖ ఏఈలు సాకేత్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..