

- డా. ఎస్ఎస్ రాజీవ్ కుమార్..
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):
పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి శెట్టిబత్తుల శ్రీరామ్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
మండల కేంద్రం శంఖవరం లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డా. శెట్టిబత్తుల శ్రీరామ్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించి, పీహెచ్ లో డెలివరీ మీద అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యులు డాక్టర్ మోహన్ సాయి రెడ్డి వచ్చిన 24 మంది గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు చేయగా 7 మందిని హైరిస్క్ ప్రెగ్నెన్సీ గా గుర్తించారు. ఈ సందర్భంగా డా. మోహన్ సాయి రెడ్డి మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు పౌష్టిక మరియు రక్త హీనత లేకుండా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని, నిత్యం ఆకుకూర, పప్పు దినుసులు, పోషక విలువలు ఉండే ఆహారం స్వీకరించాలని దీని ద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. స్టార్ లైట్ ఫౌండేషన్ ద్వారా ప్రతినెల గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించే కార్యక్రమంలో భాగంగా మంగళవారం శంఖవరం మండలం జి కొత్తపల్లి గ్రామ జనసేన పార్టీ నాయకులు కోన సత్తిబాబు భోజన దాతగా వచ్చిన గర్భిణీ స్త్రీలు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబీ), శంఖవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు గాబు సుభాష్, ఉపాధ్యక్షులు తలపంటి బుజ్జి, గునపర్తి అపురూప్, దంత వైద్యులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శంకర్, సి హెచ్ ఓ మేరీమణి, పీహెచ్ ఎన్ కృష్ణకుమారి, హెచ్ వి వెంకట లక్ష్మి, ఏఎన్ఎం లు, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.