

ఉరవకొండ మన న్యూస్: బంజారా రత్న సామాజిక వేత్త ఎస్ కే సుబ్రహ్మణ్యం నాయక్ కు శనివారం అరుదైన పురస్కారం, ఘన సన్మానం లభించింది. అనంతపురం పట్టణంలోని గిరిజన భవన్లో జరిగిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసరావు ఆయనకు శాలువా కప్పి మెమొంటోతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం నాయక్ మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన జీవితం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయిని నిజాయితీ నిబద్ధతతో సేవలు అందించినప్పుడు కలిగే తృప్తి ఎంతో గొప్పదని ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి సమాజ సేవకు పునరంకితం కావలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మలోల బంజారా సంఘం జాతీయ నేత కేశవ నాయక్ బి జి ఎస్ నేత డాక్టర్ ఎస్కే మహేష్ నాయక్ మాజీ జడ్పిటిసి తులసీదాసు నాయక్ కే మంగ నాయక్ జి మున్నా నాయక్ ఎస్ఐ ఎర్రి స్వామి డి గోపాల్ నాయక్ శినా నాయక్ కమల్ సింగ్ రాథోడ్ కే రమేష్ నాయక్ ఆర్ వి ఉప నాయక్ ఆర్ ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. బంజారా రత్న ఎస్.కె సుబ్రహ్మణ్యం నాయక్ ఆదివాసి దినోత్సవం లో ఘనంగా సన్మానం చేశారు.
బంజారా రత్న సేవాసత్కారం లభించటం పట్ల సీనియర్ పాత్రికేయుడు మాలపాటి శ్రీనివాసులు అభినందనలతో ముంచెత్తారు. సంస్కృతి సాంప్రదాయాలు, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి సుబ్రహ్మణ్యం నాయక్ అని పేర్కొన్నారు.